
DilRaju’s Pan Indian Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అయితే.. ఓ భారీ సినిమా చేయడానికి ఓకే చెప్పిన ప్రభాస్.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని.. ఆ భారీ సినిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ భారీ ప్రాజెక్ట్ ఏంటి..? ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎవరు..? పట్టాలెక్కేది ఎప్పుడు..?
ప్రభాస్ తో దిల్ రాజు ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయాలి అనుకున్నారు. ప్రభాస్ తో దిల్ రాజు మున్నా, మిస్టర్ పర్ ఫెక్ట్ అనే సినిమాలు తీసాడు. ఇందులో మున్నా ఫ్లాప్ అయితే.. మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే.. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆతర్వాత నుంచి ప్రభాస్ తో సినిమా చేయాలని దిల్ రాజు ట్రై చేస్తున్నారు కానీ.. సెట్ అవ్వడం లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో దిల్ రాజు ఓ భారీ చిత్రం నిర్మించాలి అనుకున్నారట. దీనికి రావణం అనే కథ కూడా రెడీ చేశారట కానీ.. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. DilRaju’s Pan Indian Movie.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ప్రభాస్ తో కాకుండా అల్లు అర్జున్ తో చేయాలి అనుకుంటున్నాడట దిల్ రాజు. ఇటీవల తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు.. భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నటుగా ప్రకటించారు. హీరో ఎవరు అంటే మాత్రం చెప్పలేదు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమా కంటే ముందుగా బన్నీతో ఐకాన్ అనే సినిమా చేయాలి కానీ.. కుదరలేదు. అప్పుడే దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తానని మాట ఇచ్చారట.
బన్నీ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో భారీ క్రేజీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు. అయితే.. ఈ మూవీ తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలి కానీ.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అందుచేత బన్నీ నెక్ట్స్ ఏంటి..? ఎవరితో..? అనేది క్లారిటీ లేదు. అందుచేత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో.. దిల్ రాజు నిర్మాణంలో ఉండచ్చు అని టాక్ బాగా వినిపిస్తోంది. అయితే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.