
Dil Raju Reveals the Secret of ARYA-3: ఆర్య ఓ సంచలనం. ఆర్య 2 మరో సంచలనం. ఇందులో ఆర్య విభిన్న ప్రేమకథా చిత్రంగా విజయం సాధిస్తే.. ఆర్య 2 మాత్రం విమర్శలు ఎదుర్కొంది. బన్నీ కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఆర్యకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే.. ఇటీవల ఆర్య 3 అనే టైటిల్ ను దిల్ రాజు రిజిష్టర్ చేయించారు. దీంతో ఆర్య 3 లో నటించే హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయం గురించి దిల్ రాజును అడిగితే.. ఆర్య 3 వెనకున్న అసలు సీక్రెట్ బయటపెట్టారు. ఇంతకీ.. దిల్ రాజు ఏం చెప్పారు..? ఆర్య 3 లో నటించే హీరో ఎవరు..?
ఆర్య అనగానే అందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జునే గుర్తొస్తారు. ఆతర్వాత డైరెక్టర్ సుకుమార్.. ప్రొడ్యూసర్ దిల్ రాజు గుర్తొస్తారు. ఈ ముగ్గురికి దక్కిన గొప్ప విజయం ఇది. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్.. ఇద్దరూ కూడా ఆర్య 3 సినిమా తీసే పరిస్థితిలో లేరు. ఇద్దరి రేంజ్ బాగా పెరిగింది. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయితే.. సుకుమార్ పార్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు వాళ్లు పాన్ వరల్డ్ మూవీ చేయాలనే థింకింగ్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్య 3 అంటూ లవ్ స్టోరీ చేయలేరు. మరి.. ఆర్య 3 లో ఎవరు నటిస్తారంటే.. యంగ్ హీరో ఆశీష్ పేరు వినిపించింది.
దిల్ రాజు ఈ టైటిల్ రిజిష్టర్ చేయించారు కనుక ఆర్య 3 లో నటించేది ఆశీష్ అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే.. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజును ఇదే విషయం గురించి అడిగితే.. ఈ సినిమా సీక్రెట్స్ బయటపెట్టారు. ఏం చెప్పారంటే.. సుకుమార్ తో పిచ్చాపాటి మాట్లాడుతున్న టైమ్ లో ఓ ఐడియా పుట్టిందట. ఆ ఐడియాకు ఆర్య 3 అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందట… అందుకనే ఆ టైటిల్ రిజిష్టర్ చేయించామన్నారు. డైరెక్టర్ ఎవరంటే.. సుకుమార్ లాంటి పిచ్చి ఉన్న డైరెక్టర్ కావాలి. అంతా సెట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తామన్నారు. Dil Raju Reveals the Secret of ARYA-3.
డైరెక్టర్ సరే.. మరి హీరో ఎవరు.. ఆశీష్ పేరు వినిపిస్తుంది నిజమేనా అని అడిగితే.. ఆశీష్ అనుకోలేదని.. కథ పక్కాగా సెట్ అయిన తర్వాత హీరో దగ్గరకు వెళ్లామని.. ప్రేమ కథల్లో ఆర్య’ఎలాగైతే ట్రెండ్ క్రియేట్ చేసిందో.. అలానే ఈ కథ కూడా ఖచ్చితంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చారు దిల్ రాజు. సుకుమార్ లాంటి సినిమా పిచ్చాడు కావాలంటే.. ఆయనకు శిష్యగణం ఉంది. అందులో నుంచే ఎవరో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. ఆయన వరుసగా తన శిష్యులను డైరెక్టర్స్ గా పరిచయం చేస్తున్నారు. మరి.. ఆర్య 3 లో హీరోగా ఎవరు నటిస్తారో..? ఎవరు డైరెక్ట్ చేస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: https://www.mega9tv.com/cinema/actress-meena-political-entry-she-is-likely-to-join-bjp/