
అక్కినేని నాగచైతన్య హీరోగా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీ కోసం 5 కోట్ల వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఓ భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ టైటిల్ మాత్రమే కాదు.. ఇంకా రెండు టైటిల్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఇంతకీ.. ప్రచారంలోకి వచ్చిన టైటిల్ ఏంటి..? ఈ క్రేజీ మూవీ అప్ డేట్ ఏంటి..?
ఇందులో నాగచైతన్యను ఇంత వరకు చేయని పాత్రలో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కార్తీక్ దండు. ఈ మూవీ కోసం రూపొందించిన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ లో చిత్రీకరించే సీన్స్ నిడివి 20 నిమిషాలు ఉంటుందని తెలిసింది. ఈ సీన్స్ అన్నీ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని డైరెక్టర్ కార్తీక్ దండు తెలియచేశారు. ట్రజర్ హంట్, మైథలాజికల్ టచ్ ఉన్న ఈ సినిమాకి వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ నే ఖరారు చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ బయటకు వచ్చినప్పటి నుంచి వృషకర్మ అంటే ఏంటి అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. టైటిల్ వృషకర్మనే ఫైనల్ చేశారా అని డైరెక్టర్ కార్తీక్ దండును అడిగితే.. ఇంకా రెండు టైటిల్స్ ఉన్నాయని.. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని తెలియచేశారు. విరూపాక్షలా టైటిల్ క్యాచీగా ఉండాలి.. త్వరగా జనాల్లోకి వెళ్లాలి. అలాంటి టైటిల్ కోసం సెర్చ్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. ఆమె ఆర్కియాలజీ నిపుణురాలిగా కనిపించబోతుందని తెలిసింది. ఇందులో చైతు లుక్ అండ్ గెటప్ డిఫరెంట్ గా ఉండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ కూడా పార్టనర్ కావడంతో స్క్రీన్ ప్లేలో ఆయన ఇన్ పుట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. మరి.. తండేల్ లో బ్లాక్ బస్టర్ సాధించిన చైతూ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.