‘సమ్మతమే’ డైరెక్టర్‌ నుంచి రెండో సినిమా ఎప్పుడంటే..

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ‘సమ్మతమే’ సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా రిలీజై ఈ రోజుకు సరిగ్గా మూడేళ్లవుతోంది. 2022, జూన్ 24న ‘సమ్మతమే’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీమ్ క్రేజీ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ తమ సంస్థలో ప్రొడక్షన్ నెం. 2గా కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రేపు ఉదయం 11.11 నిమిషాలకు చేయబోతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్స్, ఇతర వివరాలు రేపటి ప్రకటనలో మేకర్స్ వెల్లడించనున్నారు.