
Thank You Dear Teaser మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘థాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలకపాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు. సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పీఎల్‌కే రెడ్డి డీఓపీగా పనిచేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేయిచింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ… ‘‘రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖా నిరోషా హీరోయిన్లుగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు నిర్మాతగా, శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. శ్రీహరి గారి ఆశీర్వాదాలతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో ధనుష్ రఘుమూర్తి మాట్లాడుతూ… ‘‘మా థాంక్యూ డియర్ చిత్ర టీచర్ ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన టీజర్ ను లాంచ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది’’ అన్నారు.
హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ… ‘‘మా థాంక్యూ డియర్ సినిమా టీజర్‌ను డైరెక్టర్ వి వి వినాయక గారు లాంచ్ చేయడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ ముగించారు. Thank You Dear Teaser
Also Read: బన్నీ, అమీర్ ఖాన్ సినిమా సీక్రెట్ ఇదే.!