
Chaitu and Venky Atluri: అక్కినేని నాగచైతన్య వైవిధ్యమైన సినిమాలు చేయాలని తపిస్తుంటాడు. ఏమాత్రం కథలో కొత్తదనం ఉన్నదనిపించినా ఓకే చెబుతుంటాడు. అయితే.. ఓ యంగ్ డైరెక్టర్ చైతూతో సినిమా చేయాలని ఐదు కథలు చెబితే ఆ ఐదు కథలను రిజెక్ట్ చేశాడట. ఆ ఐదింటిలో నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఐదో సినిమా ప్రస్తుతం వేరే హీరోతో ప్లాన్ చేస్తున్నాడు ఆ డైరెక్టర్. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? చైతూ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..?
చైతూ రిజెక్ట్ చేసిన ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు.. వెంకీ అట్లూరి. మెగా హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేశాడు. ఈ సినిమా ఫరవాలేదు అనిపించి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ మూవీగా నిలిచింది. ఆతర్వాత నితిన్ తో రంగ్ దే, ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
అయితే.. వెంకీ అట్లూరి నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు కానీ.. కుదరడం లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కథలు నాగచైతన్యకి చెబితే నో చెప్పాడనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతకీ ఆ ఐదు సినిమాలు ఏంటంటే.. వరుణ్ తేజ్ తో తీసిన తొలిప్రేమ, నితిన్ తో తీసిన రంగ్ దే, ధనుష్ తో తీసిన సార్, దుల్కర్ సల్మాన్ తో తీసిన లక్కీ భాస్కర్ తో పాటు ప్రస్తుతం సూర్యతో చేస్తున్న సినిమా కథ కూడా చైతన్యకు చెప్పాడట. డేట్స్ కుదరకపోవడం వలనే చైతన్య ఈ ఐదు సినిమాలకు నో చెప్పాడని వార్తలు వస్తున్నాయి. Chaitu and Venky Atluri.
ఒక సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ అవ్వలేదు అంటే ఓకే కానీ.. ఐదు సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణం డేట్స్ కుదరకపోవడమే అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. వేరే కారణం ఏదైనా ఉందా..? అందువలనే వీరిద్దరి మధ్య ప్రాజెక్ట్ సెట్ కాలేదా..? అనేది తెలియాల్సివుంది. నాగచైతన్య.. వెంకీ అట్లూరితో సినిమా చేయాలి అనుకుంటే.. ఖచ్చితంగా చేయచ్చు. మిగిలిన సినిమాల షెడ్యూల్స్ లో మార్పులు చేసుకుని చేయచ్చు. లేదంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయమన్నా వెంకీ అట్లూరి ఆగచ్చు. మరి.. వెంకీ అట్లూరి వెయిట్ చేయను.. వెంటనే డేట్స్ కావాలి అన్నాడా..? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా జరిగిందా..? తెలియదు కానీ.. హిట్ సినిమాలను చైతూ రిజెక్ట్ చేసాడనే న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. మరి.. ఫ్యూచర్ లో చైతూ, వెంకీ అట్లూరి కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/what-is-the-secret-behind-allu-ajun-and-aamir-khans-movie/