చైతూతో మిస్ అయ్యింది.. పవర్ స్టార్ తో సెట్ అయ్యేనా..?

అక్కినేని నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు ఓ డైరెక్టర్. కథ రెడీ చేయడం.. చెప్పడం జరిగింది కానీ.. సెట్ కాలేదు. అయితే.. ఊహించని విధంగా పవర్ స్టార్ కు స్టోరీ లైన్ చెప్పడం జరిగింది. విపరీతంగా నచ్చేసిందట. అయినా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. మరి.. పవర్ స్టార్ తో అయినా ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? కథ నచ్చినా ఎందుకు ముందుకు వెళ్లలేదు. పొలిటికల్ గా బిజీగా ఉన్న పవర్ స్టార్ కొత్త సినిమాలు చేస్తారా..? పవన్ కు కథ చెప్పినప్పుడు ఏం జరిగింది..? అసలు ఈ కథ రెడీ చేసిన డైరెక్టర్ ఎవరు..?

నాంది సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాడు విజయ్ కనకమేడల. ఆతర్వాత ఉగ్రం సినిమా తీసాడు. ఇప్పుడు భైరవం అనే సినిమాను తెరకెక్కించాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబినేషన్లో రూపొందిన భైరవం సినిమా మే 30న రిలీజ్ కానుంది. అయితే.. నాంది సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత విజయ్ కనకమేడల నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు. చైతూకు కథ చెప్పడం జరిగింది. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడట. అయితే.. స్టోరీ లైన్ తో చైతూను మెప్పించిన విజయ్ కనకమేడల.. ఫుల్ నేరేషన్లో మాత్రం ఒప్పించలేకపోయాడు. అందుకనే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

ఇదిలా ఉంటే.. విజయ్ కనకమేడల.. హరీష్ శంకర్ శిష్యుడు. గబ్బర్ సింగ్ సినిమాకి హరీష్ శంకర్ దగ్గర వర్క్ చేశాడు. ఆ టైమ్ లో పవన్ కళ్యాణ్ తో విజయ్ కు పరిచయం వుంది. అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా విజయ్ ని తీసుకున్నాడట హరీష్ శంకర్. అప్పుడు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తన దగ్గర ఉన్న స్టోరీ లైన్ వినిపించాడట. ఇది ఎవరి కోసం అని అడిగితే.. వేరే హీరో ఎవరితో అయినా చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే.. నేను చేస్తే ఎలా ఉంటుంది అన్నారట పవర్ స్టార్. అంత బాగా నచ్చేసిందట. ఈ సినిమా గురించి మాట్లాడడానికి నెక్ట్స్ డే తనని కలవమన్నారట. అయితే.. ఆ రోజు రాత్రి ఏపీలో పొలిటికల్ గా ఊహించని పరిణామాలు జరగడంతో పవర్ స్టార్ బిజీ అయ్యారట. ఆతర్వాత పవన్ ని విజయ్ కలవడం కుదరలేదట. ఆ విధంగా పవర్ స్టార్ తో విజయ్ కనకమేడల చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందట. ఇప్పుడు పవన్ చేయాల్సిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి.. విజయ్ తో చేయాలనుకున్న సినిమాను పవన్ సినిమా చేస్తారో లేదో చూడాలి.