చిరు, శేఖర్ కమ్ముల కాంబో సాధ్యమేనా..?

Chiru and Sekhar Kammula combo: శేఖర్ కమ్ముల.. దర్శకులు అందరిదీ ఒక దారి అయితే.. ఈ ఒక్క డైరెక్టర్ ది మరో దారి. తన సినిమా ద్వారా ఏదోటి మంచి చెప్పాలని తపించే దర్శకుడు శేఖర్ కమ్ముల. సున్నితమైన కథాంశంం తీసుకుని తనదైన స్టైల్ లో సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ములకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. అసలు దర్శకుడు అవ్వడానికి కారణాల్లో చిరంజీవి గారు కూడా ఓ కారణం అని చెప్పచ్చు అన్నాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. అయితే.. ఇంత వరకు చిరంజీవితో సినిమా చేయలేదు. మరి.. మాస్ హీరో మెగాస్టార్ తో.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా సాధ్యమేనా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తే.. పస్ట్ డే ఫస్ట్ షోకే థియేటర్ కి వెళ్లే శేఖర్ కమ్ముల ఇంత వరకు ఆయనతో సినిమా చేయలేదు. కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లు అయ్యింది. ఈ ఇరవై ఐదు ఏళ్లలో ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా వైవిధ్యమైన కథలను అందించారు. ఇప్పుడు కుబేర అంటూ తన స్టైల్ మార్చి భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేసాడు. బెగ్గర్ వెర్సెస్ బిలియనీర్ అనేలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించడంతో అసలు ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఏం చెప్పబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని శేఖర్ కమ్ముల కలిసారు. తన నమ్మిన సిద్దాంతాల కోసం సినిమాలు తీస్తున్న శేఖర్ కమ్ములను మెగాస్టార్ అభినందించారు. మరి.. వీరిద్దరి కాంబోలో సినిమా సాధ్యమేనా..? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. శేఖర్ కమ్ముల కథ రాయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. పైగా తన సినిమాల ద్వారా ఏదైనా చెప్పాలి అనుకుంటారు. పైగా హింస చూపించకూడదు అనుకుంటారు. ఇలాంటి డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేస్తే.. సంచలనమే అవుతుంది. మరి.. ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. Chiru and Sekhar Kammula combo.

మరి.. శేఖర్ కమ్ముల నెక్ట్స్ ఏంటి అంటే.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలి అనుకంటున్నారట. నాని, శేఖర్ కమ్ముల ఈ కాంబో మూవీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంత వరకు ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇప్పుడు కుబేర సినిమా రిలీజ్ తర్వాత నానితో సినిమా చేయడం కోసం కథ పై కసరత్తు చేస్తారని తెలిసింది. ఇదే విషయం గురించి అడిగితే.. నెక్ట్స్ సినిమా నానితోనే ఉంటుంది. కాకపోతే ఏదైనా కొత్త పాయింట్ పట్టుకోవాలి.. వర్క్ జరగాల్సివుందని చెప్పారు. మరి.. నాని కోసం ఎలాంటి కథ రాస్తారో.. నానిని కొత్తగా ఎలా చూపిస్తారో.. తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/akhil-lenin-story-leaked-and-it-seems-like-a-blockbuster-movie/