
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేను తీసుకోవాలి అనుకున్నాడు. అయితే.. ఆమె రోజుకో డిమాండ్ సందీప్ ముందు పెట్టడంతో ఆమెను తీసేసి త్రిప్తిని తీసుకోవడం జరిగింది. అయితే.. దీపిక నిజ స్వరూపం బయటపడడంతో ప్రభాస్ కల్కి 2, బన్నీ ఐకాన్ సినిమాలకు కూడా ఇలాగే డిమాండ్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అసలు దీపిక డిమాండ్స్ ఏంటి..? కల్కి 2, ఐకాన్ మేకర్స్ ప్లాన్ ఏంటి..?
స్పిరిట్ మూవీ కోసం దీపిక డిమాండ్స్ ఏంటంటే.. రెమ్యూనరేషన్ 25 కోట్లు ఇవ్వాలి.. వర్కింగ్ అవర్స్ 8 గంటలు కాకుండా 6 గంటలే ఉండాలి. ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. తెలుగు లైన్స్ కు తనతో డబ్బింగ్ చెప్పించకూడదు.. తన 24 స్టాఫ్ మెంబర్స్ కి సాలరీలు ప్రొడ్యూసరే ఇవ్వాలి. ఇలా రోజుకో డిమాండ్ సందీప్ ముందు పెట్టిందట దీపిక. అంతే వెంటనే ఆమె ప్లేస్ లో యానిమల్ బ్యూటీ త్రిప్తిని తీసుకోవడం.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం.. జరిగింది. ఇక అక్కడ నుంచి దీపిక ఈ సినిమా స్టోరీని లీక్ చేయడం.. స్పిరిట్ మూవీ గురించి నెగిటీవ్ గా తన పీఆర్ టీమ్ తో న్యూస్ రాయించడంతో సందీప్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇక అక్కడ నుంచి కల్కి 2 కు కూడా దీపిక ఇలాగే డిమాండ్ చేయనుందా అనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్, అమితాబ్, కమల్ కాంబోలో నాగ్ అశ్విన్ కల్కి సినిమాను రూపొందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించిన కల్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంది. అందుకలో దీపిక పడుకునే కీలక పాత్ర పోషించబోతుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇలాగే డిమాండ్ చేస్తుందా..? చేస్తే.. కల్కి 2 మేకర్స్ ఒప్పుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది.
మరో వైపు బన్నీ, అట్లీ మూవీలో కూడా దీపిక పడుకునేను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. అయితే.. స్పిరిట్ మూవీ నుంచి దీపికను తీసేయడంతో బన్నీ, అట్లీ మూవీ చేయడానికి ఓకే అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యిందని టాలీవుడ్, బాలీవుడ్ లలో టాక్ స్ప్రెండ్ అయ్యింది. అయితే.. ఈ సినిమాకి కూడా దీపిక డిమాండ్ చేయబోతుందా..? చేస్తే ఆమె డిమాండ్ కు ఓకే చెబుతారా..? లేక సందీప్ లా వేరే హీరోయిన్ తీసుకుంటారా అనేది తెలియాల్సివుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.