
టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ కుబేర. ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈపాటికే థియేటర్స్ లోకి రావాల్సిన కుబేర కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. ఇప్పుడు జూన్ 20న కుబేర థియేటర్స్ లోకి వస్తుందని ఆమధ్య అనౌన్స్ చేశారు. ఇప్పుడు కుబేర జూన్ 20న రావడం లేదని.. పోస్ట్ పోన్ ఖాయమని ఇండస్ట్రీలో ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. మరి.. నిజంగానే కుబేర వాయిదా పడనుందా..?
కుబేర సినిమాలో నాగ్, ధనుష్ తో పాటు రష్మిక నటిస్తుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ సాంగ్ అంతగా జనాల్లోకి వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే.. కుబేర నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చిందనే విషయమే ఎవరికీ గుర్తులేదు. త్వరలోనే ప్రమోషన్స్ లో స్పీడు పెంచనున్నారని తెలిసింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా కుబేర పోస్ట్ పోన్ కానుందా అంటే.. అలాంటిది ఏమీ లేదు.. ప్రకటించినట్టుగా జూన్ 20న కుబేర థియేటర్స్ లోకి రావడం ఖాయమని సమాచారం.
నా సామి రంగ సినిమాతో సోలో హీరోగా సక్సెస్ సాధించిన తర్వాత నాగ్ నుంచి వస్తోన్న మూవీ ఇది. అయితే.. ఇందులో నాగ్ కీలక పాత్రలో కనిపిస్తారు. ధనుష్, నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. ఒక కొత్త తరహా సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుందని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల రూటు మార్చి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాని శేఖర్ కమ్ముల తీసారా..? అని షాక్ అయ్యేలా ఉంటుందని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. మరి.. కుబేర.. ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో.. థియేటర్స్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.