నాగ్ 100వ చిత్రం ఫిక్స్ అయ్యిందా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. నా సామి రంగ తర్వాత నుంచి నాగ్ సోలో హీరోగా నటించే సినిమాని ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాగ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు కానీ.. ఎలాంటి సినిమా కబురు చెప్పలేదు. ఇప్పుడు మరోసారి నాగ్ 100వ సినిమా అనేది ప్రచారంలోకి వచ్చింది. నిజంగానే ఈ క్రేజీ మూవీ ఫిక్స్ అయ్యిందా…? ఇంతకీ.. ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..?

నాగార్జున 100వ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు 100వ సినిమా గురించి అడిగిన ప్రతిసారీ.. అదొక నెంబర్ మాత్రమే అని.. పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పేవారు. అయితే.. ఇప్పుడు నాగ్ సీరియస్ గా తీసుకున్నారని.. 100వ చిత్రం కోసం గత కొంతకాలంగా కథలు వింటూనే ఉన్నారని తెలిసింది. ఈ ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఓ స్టోరీని ఫైనల్ చేశారని తెలిసింది. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందని.. ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఆ డైరెక్టర్ ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ.. డైరెక్టర్ ఎవరంటే..కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ అని సమాచారం. తమిళ్ లో కార్తీక్ నీతమ్ ఓరు వానం అనే సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగులో ఆకాశం పేరుతో రిలీజైంది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. ఈ డైరెక్టర్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ఇదొక మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే డిఫరెంట్ జోనర్ మూవీ అని టాక్. ఫస్టాఫ్ స్టోరీ లాక్ అయ్యిందట. సెకండాఫ్ పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడని.. రెండు మూడు నెలల్లో సెకండాఫ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నాగ్ కి కార్తీక్ ఫుల్ నెరేషన్ ఇస్తాడని తెలిసింది. నాగ్ మాత్రం కంగారు ఏమీ లేదు.. బాగా వర్క్ చేయమని చెప్పారట. దాదాపుగా ఈ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీ కన్ ఫర్మ్ అవుతుందేమో చూడాలి.