
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ సాధించడంతో కెరీర్ లో బాగా వెనబడ్డాడు. ఇప్పుడు కింగ్ డమ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే.. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. మే 30న రావాల్సిన కింగ్ డమ్ మూవీ జులై 4న వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి విజయ్ త్యాగం చేయకతప్పదా..? కింగ్ డమ్ మరోసారి పోస్ట్ కానుందా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఏమైంది. కింగ్ డమ్ తెర వెనుక ఏం జరుగుతోంది..?
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా జులై 4 వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఊహించని విధంగా జూన్ 12న రావాల్సిన పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా మరోసారి పోస్ట్ పోన్ కానుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇదే కనుక జరిగితే వీరమల్లు వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. జూన్ 27న మంచు విష్ణు కన్నప్ప సినిమా రానుంది. వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మంచు విష్ణును పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉందా అని అడిగారట. కారణం ఏంటంటే.. కన్నప్ప తప్పుకుంటే.. ఆ డేట్ కు వీరమల్లును తీసుకురావాలి అనేది ప్లాన్ కానీ.. మంచు విష్ణు రిలీజ్ డేట్ మార్చే ఉద్దేశ్యం లేదని చెప్పారట.
ఇప్పటికే ఏప్రిల్ 25న రావాల్సిన కన్నప్ప వాయిదాపడింది. ఇప్పుడు అన్ని రకాల మార్కెటింగ్ అండ్ థియేట్రికల్ అగ్రిమెంట్స్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నప్ప సినిమాను పోస్ట్ పోన్ చేయలేమని చెప్పారట. కన్నప్ప తప్పుకోకపోతే నెక్ట్స్ ఆప్షన్ జులై 4. ఆ డేట్ కు విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కింగ్ డమ్ సినిమాకి రిపేర్లు జరుగుతున్నాయని.. కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండడంతో ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారని.. అందుకనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదని టాక్ వినిపిస్తోంది.
అయితే.. కింగ్ డమ్ సినిమా నిర్మాత నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థతో పవన్ కళ్యాణ్ కు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎంతటి అనుబంధం ఉందో తెలిసిందే. పవన్ అడిగితే.. నాగవంశీ కింగ్ డమ్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే.. మరోసారి విజయ్ త్యాగం చేయడం తప్పదా..? కింగ్ డమ్ పోస్ట్ పోన్ కానుందా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అదే జరిగితే జులై 4న వీరమల్లు రావచ్చని.. నెలాఖరున కింగ్ డమ్ రావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. కింగ్ డమ్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిసింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.