ఎక్స్ క్లూజీవ్ న్యూస్.. నాగ్, అనిల్ రావిపూడి ఫిక్స్..!

Nagarjuna Anil Ravapudi Combo: టాలీవుడ్ కింగ్ నాగార్జున కుబేర అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని దీపక్ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారని విమర్శకుల ప్రశంసలు రావడంతో అక్కినేని అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. త్వరలో నాగ్ 100వ సినిమా చేయబోతున్న విషయం తెలిసింది. అయితే.. నాగ్ నటించే మరో మూవీ కూడా ఫిక్స్ అయ్యిందని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఇంతకీ.. నాగ్ తో అనిల్ రావిపూడి ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు ఉంటుంది..?

నా సామి రంగ సినిమా సక్సెస్ తర్వాత నాగార్జున సోలో హీరోగా నటించే సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా కథలు విన్నప్పటికీ.. రోటీన్ కథలే రావడంతో ఏ సినిమాకి ఓకే చెప్పలేదు. అందుకనే ఇంత లేట్ అయ్యింది. ఇప్పుడు నెక్ట్స్ మంత్ నాగ్ 100వ సినిమాను ప్రకటించనున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో ఈ కథతోనే తన 100వ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాగ్ పుట్టినరోజైన ఆగష్టు 29న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. నాగార్జున.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారని ఇటీవల మెగా 9 టీవీ ఎక్స్ క్లూజీవ్ న్యూస్ అందించడం జరిగింది. ఇటీవల కుబేర ప్రమోషన్స్ లో నాగార్జున.. మెగా 9 టీవీ చెప్పినట్టుగానే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక ఇప్పుడు మెగా 9 టీవీ అందిస్తోన్న మరో ఎక్స్ క్లూజీవ్ న్యూస్ ఏంటంటే.. పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తోన్న అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ప్లాన్ జరుగుతుందని తెలిసింది. Nagarjuna Anil Ravapudi Combo.

నాగార్జున కోసం అనిల్ రావిపూడి ఆల్రెడీ అదిరిపోయే స్టోరీ రెడీ చేశాడట. సుప్రియకు ఈ కథ గురించి తెలియడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి నాగ్ కు చెప్పి ఫిక్స్ చేశారని తెలిసింది. అయితే.. ఈ సినిమాను ఏ బ్యానర్ లో చేస్తారనేది తెలియాల్సివుంది. ఎప్పుడు నాగ్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఉండచ్చు అంటే.. నాగ్ 101 సినిమా ఇదే కావచ్చని సమాచారం. నాగ్ పామ్ లోకి వచ్చారు.. అనిల్ రావిపూడి ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరూ కలిస్తే.. 400 కోట్లు సాధించడం ఖాయమని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మరి.. నాగ్, అనిల్ రావిపూడి కలిసి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/balayya-creates-a-new-record-with-akhanda-2-business-over-120cr/