థియేటర్ల బంద్.. టెన్షన్ లో స్టార్స్..?

ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ వెర్సెస్ ప్రొడ్యూసర్స్ అనేది రోజురోజుకు ముదురుతుంది. ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ విధానం కావాలనడం.. ప్రొడ్యూసర్స్ రెంటల్ విధానమే కంటిన్యూ చేయాలి అనడం తెలిసిందే. నిర్మాతలు పర్సెంట్ విధానానికి అంగీకరించకపోతే.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ ప్రకటించడం అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ జనాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్.. ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. దీంతో రిలీజ్ కి రెడీ అవుతోన్న స్టార్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంతకీ.. జూన్ 1న నిజంగా థియేటర్లు బంద్ కానున్నాయా..? టెన్షన్ పడుతున్న స్టార్స్ ఎవరు..? అసలు ఏం జరుగుతోంది..?

తాము కోరినట్టుగా పర్సంటేజ్ విదానానికి అంగీకరించకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామంటే.. మరో వైపు నిర్మాతలు అసలు మేము సినిమాలు తీయడమే మానేస్తామనడంతో వివాదం మరింతగా ముదురతుంది. ఇదిలా ఉంటే.. సమ్మర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. జూన్ నుంచి భారీ చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మే 30న భైరవం మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజైన తర్వాత థియేటర్లు బంద్ అంటే రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి. అందుకనే భైరవం మేకర్స్ టెన్షన్ పడుతున్నారని టాక్. ఇక జూన్ 5న కమల్, శింబు కాంబోలోని థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కానుంది. కమల్, మణిరత్నం నాయకుడు తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళ్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. తెలుగులో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనేది ఈ మేకర్స్ లో టెన్షన్ క్రియేట్ చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అన్నీ అడ్డంకులు దాటుకుని జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అయితే.. ఎప్పటి వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అలాగే జూన్ 20న నాగార్జున, ధనుష్ కాంబో మూవీ కుబేర రానుంది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్పప్ప జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాల మేకర్స్ ను.. బంద్ అనేది ఆలోచనలోపడేసింది. అయితే.. ఒకవేళ నిజంగా జూన్ 1న థియేటర్లు బంద్ చేసినా.. ఒకటి రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. ఏం జరగనుందో చూడాలి.