
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్ కాదు.. త్రిబుల్ రోల్ చేస్తున్నాడని.. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని గత కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇందులో నటించే హీరోయిన్స్ ఫిక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. బన్నీ చేసేది డబుల్ రోలా..? త్రిబుల్ రోలా..? ఫిక్స్ అయిన ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు..?
బన్నీ, అట్లీ కాంబో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. గ్లామర్ కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారనే వార్త ముందే లీక్ అయ్యింది. ఆతర్వాత హీరోయిన్స్ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఎవరా ముగ్గురు ముద్దుగుమ్ములు అంటే.. మృణాల్ ఠాగూర్, అనన్య పాండేను ఎంచుకున్నారని తెలిసింది. మరి.. మరో కథానాయిక ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే పేరు వినిపిస్తుంది. ఈమె మెయిన్ హీరోయిన్ అని.. మిగిలిన ఇద్దరూ ఆమె పక్కన సైడ్ హీరోయిన్స్ తో సమానమని.. ఈ ముగ్గురు భామలు సినిమాకి గ్లామర్ పరంగా మరింత మైలేజ్ తీసుకురావడం ఖాయమని టాక్.
ఇక బన్నీ క్యారెక్టర్ విషయానికి వస్తే.. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి బన్నీ త్రిబుల్ రోల్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ.. త్రిబుల్ రోల్ కాదు.. డబుల్ రోలే అని టాక్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే.. రెండోది నెగిటివ్ క్యారెక్టర్ అని సమాచారం. రెండు పాత్రలే అయినప్పటికీ గెటప్స్ మాత్రం చాలా ఉంటాయని తెలిసింది. జవాన్ మూవీలో షారుఖ్ ఖాన్ ని మూడు నాలుగు గెటప్పుల్లో చూపించాడు. అలాంటి ప్రయోగమే బన్నీతో కూడా చేయబోతున్నాడట. అట్లీ హైదరాబాద్ వచ్చి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. మరి.. త్వరలో ఈ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి.