
ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌కు సీజన్-2 రాబోతోంది. ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు, రాశీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
తాజాగా “త్రీ రోజెస్” సీజన్ 2 నుంచి కమెడియన్ సత్య చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. “విశ్వంభర”, “రాజా సాబ్” ,”పెద్ది” వంటి భారీ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్న సత్య..”త్రీ రోజెస్” కంటెంట్‌ను ఇష్టపడి ఈ వెబ్ సిరీస్‌లో నటించాడు. సత్యను ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్‌లో పరిచయం చేస్తోంది మాస్ మూవీ మేకర్స్. ఈ సిరీస్‌లో హీరోయిన్ రాశీ సింగ్ భర్తగా సత్య నటిస్తున్నాడు. సత్య చేసిన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ హిలేరియస్‌గా ఉండి నవ్విస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్స్ పెట్టే ‘బెట్టింగ్ భోగి’గా మనం రియల్ లైఫ్ లో చూసే ఎంతోమందిని గుర్తుచేశాడు సత్య. రాశీ సింగ్, సత్య మధ్య వచ్చే సీన్స్ అన్నీ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించబోతున్నాయి. త్వరలోనే “త్రీ రోజెస్” సీజన్ 2 వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.