ఒకే రూటులో.. ఆర్ఆర్ఆర్ హీరోలు..?

మెగా హీరో రామ్ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్.. కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడం.. వీరిద్దరూ డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు హీరోలు గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. వార్ 2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తుంటే.. పెద్ది సినిమాలో చరణ్‌ నటిస్తున్నాడు. ఇలా ఇద్దరు ఆర్ఆర్ఆర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ ఓకే రూటులో పయనిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆర్ఆర్ఆర్ హీరోలు ఏం చేయబోతున్నారు..?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. దేవర అనే సినిమా చేశారు. కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. వార్ 2 అంటూ బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 14న వార్ 2 మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎలాగైతే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడో.. చరణ్ కూడా అదే రూటులో బాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నాడు. చరణ్‌ ఆల్రెడీ ఎప్పుడో బాలీవుడ్ లో జంజీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్‌ తో భారీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వార్ 2, డ్రాగన్ సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మైథలాజికల్ మూవీ చేయబోతున్నాడు. ఇది కార్తికేయుడు కథ అని.. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడుగా కనిపించబోతున్నాడని.. సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కిందేకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో కార్తికేయ స్టోరీతో త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఈ మైథలాజికల్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఇక చరణ్‌ విషయానికి వస్తే.. చరణ్‌ కూడా మైథలాజికల్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్.. తీసిన కిల్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ డైరెక్టర్ చరణ్ కోసం మైథలాజికల్ స్టోరీ రెడీ చేశాడట. ఆమధ్య హైదరాబాద్ వచ్చి నిఖిల్ నగేష్.. చరణ్ కు కథ చెప్పాడని.. ఈ కథకు చరణ్‌ ఓకే చెప్పాడని తెలిసింది. ఈ మూవీని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహార్ నిర్మించబోతున్నారని సమాచారం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్‌ ఇద్దూ ఒకే రూటులో వెళుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాలీవుడ్ ని మరోసారి షేక్ చేస్తారేమో చూడాలి.