నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! ఒకే చోట బాలయ్య, ఎన్టీఆర్..?

Balayya And NTR Shooting At One Place: నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్.. ఈ బాబాయ్ – అబ్బాయ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉండేది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అభిమానులు మాత్రం ఇద్దరూ కలిస్తే బాగుంటుంది.. కలిసి స్టేజ్ పైకి వచ్చినా.. కలిసి సినిమా చేసినా నందమూరి అభిమానులకు పండగే అని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. ఈ నందమూరి హీరోలు ఇప్పుడు ఓకే చోట ఉన్నారు. ఒకే చోట ఉండడం ఏంటి..? అనుకుంటున్నారా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ భారీ, క్రేజీ మూవీ ఇటీవల జార్జీయాలో షూటింగ్ జరుపుకుంది. బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య మరి కొంత మంది పై ఫైట్ సీన్స్ అలాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కలిసి చేసిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలను తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అఖండ 2 రిలీజ్ చేస్తుండడం విశేషం.

ఇక అసలు విషయానికి వస్తే.. బాబాయ్ బాలయ్య షూటింగ్ జరుపుకుంటున్న రామోజీ ఫిలింసిటీలోనే.. అబ్బాయ్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్ మూవీ షూటింగ్ ను గత కొన్ని రోజులుగా బెంగుళూరు సమీపంలో జరిగింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటుంది. ఇందులో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. అయితే.. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా..? సింగిల్ రోల్ లో కనిపిస్తాడా అనేది తెలియాల్సివుంది.

రామోజీ ఫిలిం సిటీలోనే బాలయ్య, ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఇద్దరు కలుసుకోలేదట. అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య, ఎన్టీఆర్ కలుసుకున్నారు. అలాగే బాలయ్య నటించిన కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ వచ్చారు. అప్పుడు కూడా స్టేజ్ పై బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ కలుసుకున్నారు. ఆతర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒకే చోట షూటింగ్ చేస్తున్నప్పటికీ.. కలుసుకునే పరిస్థితి లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ ఎన్టీఆర్ కలుసుకునే సందర్భం ఎప్పుడు వస్తుందో చూడాలి. Balayya And NTR Shooting At One Place.

Also Read: https://www.mega9tv.com/cinema/kuberaa-makers-grabbed-rajinikanths-coolie-telugu-rights/