
విజన్స్ సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలోకేజేఆర్ హీరోగా తెన్పతియాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘గుర్తింపు’. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ను ఈరోజు రిలీజ్ చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ‘గుర్తింపు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ- ” పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నాo. ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంతకు ముందు మా సంస్థలో శివ కార్తికేయన్ చిత్రాన్ని ‘ వరుణ్ డాక్టర్‘ పేరుతో అనువదించి మంచి విజయాన్ని అందుకున్నాo. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ చిత్రం నిర్మించాను.” అని తెలిపారు. స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా రానున్న ఈ ‘గుర్తింపు’ చిత్రంలో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.