
కోలీవుడ్ స్టార్ ధనుష్ తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని తపిస్తుంటాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటాడు. తను హీరో మాత్రమే కాదు.. దర్శకుడు కూడా. ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడుగా రాణిస్తున్నాడు. ఇప్పుడు కుబేర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈమూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించడం విశేషం. జూన్ 20న ఈ భారీ పాన్ ఇండియా మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే.. ధనుష్ తన పై కుట్రలు చేస్తున్నారని అనడం హాట్ టాపిక్ అయ్యింది. నిజంగానే ధనుష్ పై కుట్ర చేస్తున్నారా..? కుట్ర చేస్తున్నది ఎవరు..? అసలు ఏమైంది..?
కుబేర ఆడియో లాంచ్ లో ధనుష్ మాట్లాడుతూ.. తను ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాను. సినిమా పై ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. అంతే కాకుండా.. తన సినిమా రిలీజ్ కు ముందు నెలకు రెండు సార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు అన్నారు ధనుష్. స్వయంగా ధనుష్ ఇలా తన పై కుట్ర చేస్తున్నారనడం ఆసక్తిగా మారింది. ఎంత మంది కుట్ర చేసినా.. ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే.. అభిమానులే తన బలమని.. వాళ్లు నాతోనే ఉన్నారని చెప్పారు. 23 సంవత్సరాలుగా తనతోనే ఉన్నారని.. అభిమానులు నా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ అభిమానులను ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ వేడుకలో ధనుష్ ఓ మంచి సందేశం కూడా ఇచ్చాడు. అదేంటంటే.. మన ఆనందం మనలోనే ఉంటుందని చెప్పాడు. దాని కోసం బయట వెతుక్కోవద్దు. మనల్ని మనమే సంతోషంగా మార్చుకోవాలి. అసలు ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటాయో అదే చేయాలి. నా వరకు అయితే.. బాగా తింటే ఆనందంగా ఉంటాను అని చెప్పాడు. ధనుష్ ఇలా మాట్లాడడాన్ని బట్టి.. తన పై నిజంగానే ఎవరో కావాలని నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే తను ఆనందం మన చేతుల్లోనే ఉందని చెప్పడాన్ని బట్టి.. ఏ విషయంలోనే బాగా బాధపడ్డాడు అని.. అందుకనే ఇక నుంచి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాడు అనిపిస్తోంది.
ధనుష్ స్పీచ్ అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ధనుష్.. హీరోయిన్ మీనా పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై మీనా స్పందించారు. తను రెండో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదని.. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే.. చెబుతాను అన్నారు. అంత వరకు ఇలాంటి ప్రచారలు చేయద్దన్నారు. ధనుష్ గురించి ఏదో రకంగా నెగిటివ్ వార్తలు రావడం బట్టి చూస్తుంటే.. నిజంగానే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. అయితే.. ఎందుకు చేస్తున్నారో..? ఎవరు చేస్తున్నారో.. ఏదో రోజు ధనుషే బయటపెడతాడేమో చూడాలి.