హీరో ఒక్కడే… కానీ…ఇన్ని సీక్వెల్సా…?

ఒకప్పుడు ఒక కథను ఒక పార్ట్ లోనే చెప్పేవారు. బాలీవుడ్ లో కథను రెండు పార్టులుగా చెప్పేవారు కానీ.. సౌత్ లో మాత్రం ఒక పార్ట్ లోనే చెప్పేవారు. అయితే.. బాహుబలి వచ్చినప్పటి నుంచి కథను రెండు పార్టులుగా చెప్పడం అనేది స్టార్ట్ అయ్యింది. అలాగే సీక్వెల్స్ అంటూ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటూ తీస్తున్నారు. ఈ సీక్వెల్స్ చేయడానికి అటు దర్శకులు ఇటు హీరోలు ఇష్టపడుతున్నారు. అయితే.. సౌత్ లో ఒక హీరో మాత్రం ఎక్కువ సీక్వెల్స్ లో నటిస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ హీరో ఎవరు..? ఆయన చేస్తున్న సీక్వెల్స్ ఏంటి..?

సౌత్ లో ఎక్కువ సీక్వెల్స్ చేస్తోన్న హీరో ఎవరో కాదు.. కార్తీ. అవును.. కార్తీ ఇప్పుడు వరుసగా సీక్వెల్స్ చేస్తుండడం విశేషం. ఇంతకీ.. కార్తీ చేస్తున్న సీక్వెల్స్ ఏంటంటే.. ప్రస్తుతం సర్థార్ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ మూవీ పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టులో ఈ సర్థార్ 2 చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా తెలుగులో వరుసగా హిట్, హిట్ 2, హిట్ 3 అంటూ సీక్వెల్స్ వచ్చాయి. ఈ మూడు పార్టులు సక్సెస్ అయ్యాయి. అయితే.. హిట్ 3 సీక్వెల్ హిట్ 4 లో కార్తీ నటించనున్నాడు. ఇందులో కార్తీ వీరప్పన్ అనే పాత్రలో కనిపించనున్నాడు.

కార్తీ నటించబోయే మరో సీక్వెల్ ఖైదీ 2. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ తెలుగు, తమిళ్ లో భారీ విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం కూలీ సినిమాని తెరకెక్కిస్తోన్న లోకేష్‌ కనకరాజ్ నెక్ట్స్ ఖైదీ 2 చేయనున్నట్టుగా ప్రకటించాడు. దీని తర్వాత కార్తీ ఖాకీ 2 కూడా చేయనున్నాడు. ఈ మూవీకి హెచ్ వినోద డైరెక్టర్. ప్రస్తుతం విజయ్ తో జన నాయగన్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఖాకీ 2 చేయనున్నాడని సమాచారం. కంగువ మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో సీక్వెల్ కి బ్రేక్ పడింది కానీ.. లేకపోతే కార్తీ సీక్వెల్స్ లిస్ట్ లో కంగువ కూడా ఉండేది. ఏది ఏమైనా ఎక్కువ సీక్వెల్స్ చేస్తున్న హీరోగా కార్తీ నిలిచాడు. మరి.. ఈ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.