అర్జున్ అంబటి హీరోగా ‘పరమపద సోపానం’.. లిరికల్ సాంగ్ రిలీజ్

The current image has no alternative text. The file name is: 2-1.jpg

టాలీవుడ్‌కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థపై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. పూరి జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు.