
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతుందా..? అంటే.. అవుననే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా ట్రెండ్ రావడం.. మల్టీస్టారర్ ట్రెండ్ రావడం.. ముఖ్యంగా సౌత్ హీరో, నార్త్ హీరో కలిసి సినిమా చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. ప్రభాస్, హృతిక్ కలిసి సినిమా చేస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. అయితే.. నిజంగా ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యిందా..? అసలు ఈ వార్త బయటకు రావడం వెనకున్న వాస్తవం ఏంటి..?
ఇండియాలో టాప్ ప్రొడక్షన్ హౌసెస్స్ లో ఒకటి హోంబలే ఫిల్మ్స్. ఇప్పటి వరకు యశ్ తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, రిషబ్ శెట్టితో కాంతార చిత్రాలను నిర్మించి సంచలన విజయాలు సొంతం చేసుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ సినిమాను నిర్మించింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తుండడంతో సలార్ 2 లేట్ అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే సలార్ 2 సెట్స్ పైకి వచ్చుండేది.
ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూడు భారీ చిత్రాలు నిర్మించేందుకు డీల్ కుదుర్చుకుంది. సలార్ కంప్లీట్ అయ్యింది. సలార్ 2 చేయాలి. దీంతో ప్రభాస్ తో చేయాల్సిన మరో సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. హను రాఘవపూడితో ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడుగా నటిస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో భారీ చిత్రం చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. హృతిక్, హోంబలే మధ్య భారీ డీల్ సెట్ అయ్యిందనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అయితే.. ఈ వార్తను హోంబల్ సంస్థ సోషల్ మీడియా ద్వారా కన్ ఫర్మ్ చేసింది. ఈ న్యూస్ అఫిషియల్ గా బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్, హృతిక్ కాంబోలో ఈ నిర్మాణ సంస్థ భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తుందని.. ఖచ్చితంగా ఈ కాంబో మూవీ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్, హృతిక్ కలిసి నటిస్తే.. చరిత్ర సృష్టించడం ఖాయం.