ఆ ఇద్దరూ.. బన్నీకి షాక్ ఇవ్వబోతున్నారా..?

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో బన్నీతో సినిమా చేసేందుకు టాలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇది క్రేజీ పాన్ వరల్డ్ మూవీ. ఇదిలా ఉంటే.. బన్నీకి ఇద్దరు షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరు..? అసలు ఏం జరగనుంది..?

అల్లు అర్జున్ ను స్టైలీష్ స్టార్ అని పిలిచేవారు. పుష్ప రిలీజ్ తర్వాత సుకుమార్.. బన్నీ స్టైలీష్ స్టార్ మాత్రమే కాదు.. ఐకాన్ స్టార్ అంటూ చెప్పడంతో.. ఇక అక్కడ నుంచి ఐకాన్ స్టార్ అనే పేరుతో బన్నీని పిలవడం స్టార్ట్ చేశారు. అయితే.. దీనికంటే ముందు డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఐకాన్ అనే కథను బన్నీకి చెప్పడం జరిగింది. కథ నచ్చి ఈ సినిమా చేస్తానని బన్నీ మాట ఇచ్చాడు. ఆతర్వాత ఏమైందో కానీ.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కథ విన్నప్పుడు బన్నీ కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడట. దీనికి తగ్గట్టుగా కథను మార్చాడట వేణు శ్రీరామ్. అయితే.. ఐకాన్ అనే టైటిల్ బన్నీకి నచ్చడంతో ఐకాన్ స్టార్ అని పెట్టుకోవాలి అనుకోవడం.. బన్నీ మనసు తెలుసుకుని సుకుమార్ ఐకాన్ స్టార్ అని నామకరణం చేయడం జరిగింది. Icon Star Allu Arjun.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బన్నీకి చెప్పిన ఐకాన్ కథతో మరో స్టార్ తో సినిమా చేయడానికి వేణు శ్రీరామ్, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ బిగ్ స్టార్ కు దిల్ రాజు ఈ కథ గురించి చెప్పారట. త్వరలో ఆ స్టార్ తో కథాచర్చలు జరుగుతాయని డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెలియచేశారు. ఈ వార్త లీకైనప్పటి నుంచి ఐకాన్ అనే టైటిల్ తో సినిమా వస్తే.. ఐకాన్ స్టార్ అని ఆ సినిమా హీరోని పిలుస్తారు కదా.. మరి.. బన్నీ ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ ని కంటిన్యూ చేస్తాడా..? లేక వదిలేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బన్నీ అట్లీతో చేస్తోన్న క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి టైటిల్ ఇంకా పెట్టలేదు.

ఈ సినిమాకి అనుకున్న టైటిల్స్ లో ఐకాన్ కూడా ఉందని.. అలాగే సూపర్ హీరో టైటిల్ కూడా ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తను నటిస్తున్న సినిమాకి ఐకాన్ అనే టైటిల్ పెడితే.. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తనే ఐకాన్ స్టార్ అవుతాడు. ఇలా కూడా జరిగే అవకాశం ఉంది. ఇలా జరగాలంటే.. బన్నీ ఐకాన్ అనే టైటిల్ నే పెట్టాలని ఫిక్స్ అవ్వాలి.. దీనికి డైరెక్టర్ అట్లీ, సన్ పిక్చర్స్ ఓకే అనాలి. వాళ్లంతా ఓకే అనుకున్నా.. దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఓకే చెప్పాలి. ఎందుకంటే.. ఐకాన్ అనే టైటిల్ ని అప్పట్లో రిజిస్టర్ చేయించారని వార్తలు వచ్చాయి. మొత్తానికి మరోసారి ఐకాన్ వార్తల్లో నిలిచింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/the-reason-why-natural-star-nani-rejected-yellammas-story/