ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. లెనిన్ 100 కోట్లు ఖాయమా..?

Akhil Lenin 100cr Sentiment: అక్కినేని హీరోలు గత కొంతకాలంగా కెరీర్ లో వెనకబడ్డారు. ఇక ఈ సంవత్సరంలో మాత్రం దూసుకెళుతున్నారు. అయితే.. అక్కినేని అభిమానులు అందరూ అఖిల్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ సాధిస్తాడా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు లెనిన్ అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా డైరెక్టర్. నవంబర్ లేదా డిసెంబర్ లో లెనిన్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఆ సెంటిమెంట్ కనుక వర్కువుట్ అయితే.. లెనిన్ 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ.. ఏంటా సెంటిమెంట్..? లెనిన్ అప్ డేట్ ఏంటి..?

ఇప్పటి వరకు అఖిల్ యాక్షన్ మూవీస్, క్లాస్ మూవీస్ చేశాడు. అయితే.. ఇప్పుడు గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ముందుగా కథానాయికగా శ్రీలీలను తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని సమాచారం. అఖిల్ సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే.. కష్టానికి తగ్గ ఫలితం మాత్రం రావడం లేదు. ఈసారి మాత్రం బ్లాక్ బస్టర్ సాధించడం కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసి రంగంలోకి దిగాడు. ప్రేమకథకు డివోషనల్ టచ్ ఇవ్వడంతో ట్రెండీగా అందరికీ కనెక్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 7న నాగచైతన్య తండేల్ అంటూ వచ్చాడు. చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే బన్నీ వాసు ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే తండేల్ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్యకు ఫస్ట్ 100 కోట్లు సినిమాగా నిలిచింది. ఇక జూన్ 20న నాగార్జున, ధనుష్ నటించిన కుబేర రిలీజైంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమా కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. Akhil Lenin 100cr Sentiment.

ఈ విధంగా ఈ సంవత్సరంలో అక్కినేని హీరోలు నాగచైతన్య తండేల్ తో, నాగార్జున కుబేర సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు. దీంతో అభిమానులు ఇది అక్కినేని నామా సంవత్సరం అంటూ తెగ సంబరపడుతున్నారు. ఈ సెంటిమెంట్ కలిసొస్తే.. అఖిల్ లెనిన్ మూవీ కూడా 100 కోట్ల కలెక్ట్ చేయడం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇటీవల తిరుపతిలో లెనిన్ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు ఆశిస్తున్నట్టుగా లెనిన్ మూవీ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరితే అక్కినేని అభిమానులకు పండగే.

Also Read: https://www.mega9tv.com/cinema/dil-raju-says-he-will-deliver-a-block-buster-movie-to-ram-charan-this-time-mega-fans-are-in-curiosity/