
నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ ఇద్దరూ హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించారు. నాటు నాటు పాటలో నువ్వా.. నేనా..? అన్నట్టుగా పోటీపడి డ్యాన్స్ చేశారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో చరిత్ర సృష్టించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైమ్ లో.. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని.. విజయేంద్రపసాద్ ప్రకటించారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అనేది మరోసారి తెర పైకి వచ్చింది. ఇంతకీ.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..?
బాహుబలి సినిమాతో పోలీస్తే.. ఆర్ఆర్ఆర్ అంత లేదన్నారు కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండియా తరుపున అఫిషియల్ గా ఆస్కార్ అవార్డ్ కు పంపించకపోయినా.. రాజమౌళి తన తెలివితేటలతో ఆస్కార్ పోటీలో నిలిచేలా చేయడంతో పాటు.. ఆస్కార్ ను సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఈ మూవీ సీక్వెల్ గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సీక్వెల్ స్టోరీ రాయమన్నాడని చెప్పారు. అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది కానీ.. క్లారిటీ లేదు.
ఇప్పుడు లండన్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉందా..? లేదా..? అనే ప్రశ్న ఎదురైంది. అయితే.. దీనికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉందని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. నెటిజన్లు మాత్రం మాకు నమ్మకం లేదు దొరా అనే మీమ్‌తో ఈ వార్తలకు కౌంటర్లు ఇస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అయినా.. రాజమౌళి అయినా.. ఏదో ఆ సమయానికి సీక్వెల్ గురించి అడిగితే.. చేస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారే తప్పా నిజంగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో వీరిద్దరితో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అంటే.. ఇప్పట్లో ఉండకపోవచ్చు. జక్కన్న చెప్పినట్లుగా కుదిరితే మాత్రం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు పండగే.