బన్నీ శక్తిమాన్ ప్రాజెక్ట్! అసలు నిజం ఇదే!

Joseph gave clarity about shakthimaan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అన్ని భాషల టాప్ డైరెక్టర్స్ బన్నీతో వర్క్ చేయాలి అనుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో బన్నీ చేయాల్సిన ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వెళ్లడంతో.. బన్నీ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో బన్నీ సినిమా ఫిక్స్ అని.. ఈ మూవీ టైటిల్ శక్తిమాన్ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తల పై బాసిల్ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. శక్తిమాన్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పారు..? అసలు నిజం ఏంటి..?

త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని ఎప్పుడైతే న్యూస్ ఇచ్చారో అప్పటి నుంచి బన్నీ.. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌ తో సినిమా చేయబోతున్నాడని.. అది శక్తిమాన్ స్టోరీ అంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై గీతా ఆర్ట్స్ కానీ.. బన్నీ కానీ స్పందించలేదు. నిజం కాకపోతే ఆ న్యూస్ లో నిజం లేదని క్లారటీ ఇస్తారు కదా.. అలా చేయలేదు. పైగా బన్నీ వాసు ఈమధ్య గీతా ఆర్ట్స్ నుంచి సర్ ఫ్రైజ్ న్యూస్ వస్తుందని చెప్పడంతో.. అది ఇదే అనుకున్నారు. శక్తిమాన్ ప్రాజెక్ట్ నిజమే కావచ్చు.. బన్నీకి మలయాళంలో మంచి క్రేజ్ ఉండడంతో ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడేమో అనుకున్నారు.

అయితే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తల పై జోసఫ్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. శక్తిమాన్ ప్రాజెక్ట్ ను చేయడం లేదు. ఆ సినిమాను చేస్తే.. బాలీవుడ్ హీరో రణ్‌ వీర్ సింగ్ తోనే చేస్తాను అని చెప్పాడు. ప్రచారంలో ఉన్న వార్తలు ఊహాగానాలే అని చెప్పాడు. దీంతో బన్నీ, బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. రణ్‌ వీర్ సింగ్ తో ఈ శక్తిమాన్ ప్రాజెక్ట్ కు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయిట. ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని తెలిసింది. మరి.. ఊహించని విధంగా ఈ వార్త ఎందుకు ప్రచారంలోకి వచ్చింది అనేది ఆసక్తిగా మారింది. Joseph gave clarity about shakthimaan.

విషయం ఏంటంటే.. బాసిల్ జోసెఫ్ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి గీతా ఆర్ట్స్ లో కథ చెప్పాడట. అయితే.. ఆ కథ శక్తిమాన్ కథ కాదట. అది ఓ చిన్న సినిమా కథ అని తెలిసింది. జోసెఫ్‌ వచ్చి గీతా ఆర్ట్స్ లో కథ చెప్పాడనే వార్త బయటకు రావడంతో అది బన్నీ కోసమే అంటూ సోషల్ మీడియాలో కథలు అల్లేసారు. మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే.. గీతా ఆర్ట్స్ లో బాసిల్ చెప్పిన కథ బన్నీకి కూడా నచ్చిందట. అయితే.. ఆ కథ ఏంటి..? ఎవరితో చేయాలి అనుకుంటున్నారు..? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లారిటీ రావాల్సివుంది. మరి.. బాసిల్ జోసెఫ్ చెప్పిన కథలో హీరో ఎవరు అవుతారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/keerthi-suresh-upcoming-movie-projects-and-latest-updates/