మెగాస్టార్ తో అనుకుంటే.. మేనల్లుడుతో సెట్ అయ్యిందా..?

ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే… మరో హీరోతో సెట్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. కథ నచ్చడంతో పాటు అన్నీ అనుకూలిస్తేనే ఆ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఓ డైరెక్టర్ మెగాస్టార్ తో సినిమా చేయాలనుకుంటే.. మెగా మేనల్లుడుతో సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? ఆ మెగా మేనల్లుడు ఎవరు..? ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

మెగాస్టార్ తో సినిమా చేయాలనుకున్న ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కళ్యాణ్ కృష్ణ. చిరు కోసం స్టోరీ రెడీ చేయడం.. నచ్చి సినిమా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అంతే కాదండోయ్ ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఆ టైమ్ లో చిరు నటించిన భోళా శంకర్ రిలీజైంది. అది రీమేక్ కావడంతో జనాలు ఆదరించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. కళ్యాణ్ కృష్ణతో చేయాలనుకున్న మూవీ కూడా రీమేకే. అయితే.. ఇప్పుడు రీమేక్ చేస్తే జనాలు చూసే పరిస్థితి లేదు. అందుకనే ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు.

అప్పటి నుంచి కళ్యాణ్ కృష్ణ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. మేటర్ ఏంటంటే.. చిరంజీవి తన మేనల్లుడు వైష్టవ్ తేజ్ తో సినిమా చేయమన్నారట. దీంతో వైష్ణవ్ తేజ్ కోసం కళ్యాణ్ కృష్ణ స్టోరీ రెడీ చేస్తున్నారట. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తర్వాత సక్సెస్ సాధించలేదు. కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ.. ఇలా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలని.. సరైన కథతో సినిమా చేయాలని చాలా కథలు విన్నాడట కానీ.. ఏదీ నచ్చలేదు. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని.. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి.. ఇది నిజమౌతుందో లేదో చూడాలి.