
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ భారీ పీరియాడిక్ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ సినిమాలా అలా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాపడిన వీరమల్లు జూన్ 12న రావడం పక్కా అన్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత జూన్ 12న రావడం లేదు.. రిలీజ ఎప్పుడు అనేది త్వరలో అనౌన్స్ చేస్తామన్నారు. ఇక అక్కడ నుంచి వీరమల్లు వచ్చేది ఎప్పుడు అనేది సమాధానం లేని ప్రశ్నలా తయారైంది. తాజాగా వీరమల్లుకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని.. కన్నప్పకు పోటీగా రాబోతోందనే ప్రచారం మొదలైంది. ఇంతకీ.. వీరమల్లు వచ్చేది ఎప్పుడు..? వీరమల్లు మేకర్స్ ప్లానింగ్ ఏంటి..?
జూన్ 12న రావాల్సిన వీరమల్లు రావడం గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రధానంగా జూన్ 26న వీరమల్లు రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. జూన్ 27న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్ కానుంది. ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారా అని అడిగితే.. ఇప్పటికే పోస్ట్ పోన్ చేశాం.. అలాగే చాన్నాళ్లు నుంచి షూటింగ్ చేశాం.. పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్లానింగ్ అంతా జరిగింది. ఇప్పుడు లాస్ట్ మినిట్ లో రిలీజ్ డేట్ మార్చలేం.. ఖచ్చితంగా జూన్ 27న కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పాడట మంచు విష్ణు.
కన్నప్ప సినిమాలో మంచు విష్ణు హీరోయినప్పటికీ.. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ పాత్ర ఐదు నిమిషాలో.. పది నిమిషాలో కాదు.. ఏకంగా ఓ అరగంట సేపు కనిపిస్తాడని మంచు విష్ణు తెలియచేశాడు. ఈ పాత్ర కనుక తెర పై పండితే.. మంచి టాక్ వస్తే.. కన్నప్ప పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ సినిమాలో శివుడి ఎలిమెంట్స్, క్లైమాక్స్, సాంగ్స్, కన్నప్ప గొప్పదనం చూపించే ఎపిసోడ్లు ఇవన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయని.. ఆడియన్స్ కు కొత్త అనుభూతి కలిగిస్తాయని అంటున్నారు కన్నప్ప మేకర్స్.
వీరమల్లు విషయానికి వస్తే.. ఇప్పటి వరకు బజ్ అనేది తక్కువుగానే ఉన్నప్పటికీ.. ట్రైలర్ రిలీజ్ అయితే.. మాత్రం అంచనాలు అమాంతం పెరుగుతాయి. ఈ మూవీ ఎన్నో సార్లు వాయిదాపడడం వలన ఆడియన్స్ లో అంతగా ఆసక్తి లేనట్టుగా టాక్ వినిపిస్తోంది కానీ.. ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతని నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో మాత్రం రికార్డులు క్రియట్ చేయడం ఖాయమనే టాక్ ఉంది. ఈ మూవీ కనుక బాగుంది అనే టాక్ వస్తే.. పవర్ స్టార్ సునామిని తట్టుకోవడం కష్టం. మరి.. జూన్ 26న వీరమల్లు, జూన్ 27న కన్నప్ప వస్తాయా..? లేక ఏదైనా మార్పు ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. టాకే కీలకం. ఇక… ఏం జరగనుందో చూడాలి మరి.