ఆ రెండు సినిమాల్లో కీర్తి సురేష్ ఫిక్స్..?

Keerthi Suresh upcoming movies: మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకోవడం తెలిసిందే. ఈ అవార్డ్ అందుకున్న తర్వాత కీర్తి సురేష్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై ఎక్కువుగా కాన్ సన్ ట్రేషన్ చేసింది. ఆమధ్య సక్సెస్ కు దూరవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని తపిస్తుంది. ముఖ్యంగా తెలుగులో సినిమాలకు గ్యాప్ వచ్చింది. అందుకనే.. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటుందట. అయితే.. తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టుగా కీర్త సురేష్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? ఆ రెండు సినిమాల గురించి కీర్తి రియాక్షన్ ఏంటి..? Keerthi Suresh upcoming movies.

కీర్తి సురేష్.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్లోనూ నటిస్తుంది. అయితే.. ఈ అమ్మడు తెలుగులో సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ సినిమాలో నటించింది. ఆతర్వాత పెళ్లి చేసుకుంది. దీంతో సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్‌ తెలుగులో సుహాస్ తో కలిసి నటించింది. ఈ సినిమా పేరు ఉప్పు కప్పురంబు. ఇదోక సెటైరికల్ కామెడీ నేపథ్యంతో సాగే సినిమా. అయితే.. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కావడం లేదు.. రఘతాత తరహాలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియ‌లో జూలై 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇంత వ‌ర‌కు వ‌చ్చిన డార్క్ కామెడీ సినిమాల‌కు పూర్తి భిన్నంగా సాగే సినిమా ఇది. ఒక సీరియ‌స్ విష‌యాన్ని చాలా ఫ‌న్నీగా ఇందులో చెప్పామని తెలియచేసింది. అయితే.. తెలుగులో విజయ్ దేవరకొండ నటించనున్న రౌడీ జనార్థన్ మూవీలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అని అడిగితే.. దిల్ రాజు చెబుతారు అన్నారు. ఒకవేళ నటించకపోతే నటించడం లేదు అని ఖచ్చితంగా చెప్పేది అలా కాకుండా దిల్ రాజు చెబుతారు అన్నారంటే.. విజయ్ రౌడీ జనార్థన్ లో నటించడం ఫిక్స్ అనే అర్ధం అంటున్నారు సినీ జనాలు.

కీర్తి సురేష్‌ ఈ సినిమాతో పాటు ఎల్లమ్మ సినిమాలో కూడా నటించబోతున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా బలగం వేణు ఈ సినిమాకి డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారు. అయితే.. ఈ మూవీ గురించి కూడా కీర్తి సురేష్‌ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎల్లమ్మ సినిమా షూట్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమైతే.. రౌడీ జనార్థన్, ఎల్లమ్మ ఈ రెండు సినిమాలు కీర్తి సురేష్ కు మంచి పేరు తీసుకువచ్చి మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/veeramallu-release-date-fixed-will-those-sentiments-be-met-with-the-tholiprema/