నాగ్ 100వ సినిమా ప్లాన్ మారిందా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటుంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఈమధ్య నాగ్ సెంచరీ మూవీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ నాగ్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపించింది. దీంతో త్వరలోనే ఈ క్రేజీ మూవీని అధికారికంగా ప్రకటిస్తారని సినీ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు నాగ్ 100వ సినిమా ప్లాన్ మారిందనేది సరికొత్త వార్త. అసలు నాగ్ ప్లాన్ మారడానికి కారణం ఏంటి..? అసలు ఏమైంది…?

నాగార్జున నటించిన 100 సినిమాలు ఎప్పుడో కంప్లీట్ అయ్యాయి. ఎలా అంటారా..? నాగార్జున కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం వలన వాటిని కూడా లెక్కేస్తే ఎప్పుడో 100 అనే మైలు రాయిని దాటేశారు. అయితే.. వందో సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలని.. అలాంటి కథ కుదిరినప్పుడు ఇదే నా 100వ సినిమా అని ప్రకటిస్తానని నాగ్ గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన లెక్క 100 దగ్గరకు చేరినట్టుంది. గత కొన్ని రోజులుగా సెంచరీ మూవీ కోసం కసరత్తు చేయిస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమానే తన వందో సినిమాగా ప్రకటించాలి అనుకున్నారు.

అయితే.. ఇప్పుడు నాగ్ ప్లాన్ మారిందట. ఏదైనా అద్భుతమైన స్టోరీ, స్టార్ డైరెక్టర్ సెట్ అయితేనే.. వందో సినిమాగా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. మనం సినిమా అక్కినేని కుటుంబానికి స్పెషల్ మూవీ. అలాగే తన 100వ సినిమాని కూడా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట. అందులో చైతన్య, అఖిల్ కీలక పాత్రలు పోషించేలా కథను డిజైన్ చేయాలి అనేది నాగ్ ప్లాన్ అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మించనున్నారు. ప్రస్తుతానికి అయితే.. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో నాగ్ వందో సినిమా పెండింగ్ లో ఉందని టాక్. మరి.. నాగ్ 100వ సినిమా విషయంలో ఏం చేస్తారో చూడాలి.