పవన్, అనుష్కతో.. అరుదైన ఘనత దక్కించుకున్న క్రిష్‌..!

డైరెక్టర్ క్రిష్‌.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు. జనాలకు కొత్త కథలు.. మన కథలను చెప్పాలని తపిస్తుంటాడు. తన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం చూపించాలి అనుకుంటాడు. అయితే.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతే కాదండోయ్.. క్రిష్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. అదేలా అంటారా..? అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.

గమ్యం సినిమతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించాడు. ఆతర్వాత వేదం, కృష్ణవందే జగద్గురుమ్, కంచె తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ తో అద్భుత విజయం సాధించాలి అనుకున్నాడు కానీ.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీంతో కెరీర్ లో వెనకబడ్డాడు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో వీరమల్లు సినిమాని ప్రకటించినప్పుడు క్రిష్ పేరు మారుమ్రోగింది. ఇప్పుడు అనుష్కతో ఘాటి సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు క్రిష్‌.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఏ డైరెక్టర్ కి అయినా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంటుంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్.. ఇలా టాప్ డైరెక్టర్సే కాదు.. యంగ్ డైరెక్టర్స్ కు అయినా సంవత్సరానికి ఒక సినిమా చేయడం అంటే చాలా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్ క్రిష్‌ నుంచి కేవలం నెల రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదల అవుతుండడం విశేషం. ఈ నెల 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాని ఎనభై శాతం వరకు డైరెక్ట్ చేసింది క్రిషే. మిగిలిన ఇరవై శాతం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు.

ఇక వీరమల్లు తర్వాత నాలుగు వారాలు కూడా అవ్వక ముందే అంటే జులై 11న అనుష్క ఘాటీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా గ్లింప్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇందులో అనుష్కను ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా లేడీ డాన్ లా చూపించడంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఏర్పడింది. అటు పవన్, ఇటు అనుష్క.. ఇద్దరూ కూడా కొంత గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరమల్లు సినిమా ఆలస్యం అవ్వడం.. కొండపొలం సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ ప్రభావం క్రిష్ పై చాలా పడింది. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న క్రిష్ కు పవన్ వీరమల్లు, అనుష్క ఘాటీ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించి మళ్లీ ఫామ్ లోకి తీసుకువస్తాయో లేదో చూడాలి.