
Krish’s Veeramallu And Ghati: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాకి ముందు డైరెక్టర్ క్రిష్ అయితే.. ఆతర్వాత డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 24న రిలీజ్ కి రెడీ అవుతోంది. డైరెక్టర్ క్రిష్ తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మూవీ ఘాటీ. ఇదిలా ఉంటే.. వీరమల్లుకు జరిగినట్టే.. ఘాటీకి కూడా జరుగుతుండడం అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. వీరమల్లుకు ఏం జరిగింది..? ఘాటీకి ఏం జరిగింది..? అసలు క్రిష్ కే ఎందుకు ఇలా జరుగుతోంది..?
పవన్ కళ్యాణ్ తో వీరమల్లు సినిమాని నాలుగేళ్ల క్రితం స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి.. ఎప్పుడో థియేటర్స్ లోకి రావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఈ నెల 24న వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. వీరమల్లు సినిమా ఆలస్యం అవుతుందని క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనుష్కతో ఘాటీ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అనుష్కను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపిస్తున్నారు. టీజర్ సినిమా పై బజ్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇది కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
ఏప్రిల్ 18న ఘాటీ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత జులై 11న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే.. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.. ప్రచారంలో ఉన్న వార్తలను బట్టి చూస్తుంటే.. ఘాటీ పోస్ట్ పోన్ అవ్వడం అనేది నిజమే అని తెలుస్తోంది. క్రిష్ సినిమాని చాలా ఫాస్ట్ గా తీయాలి అనుకుంటాడు. ఆయన ఫాస్ట్ గా తగ్గట్టుగా వీరమల్లు వర్క్ జరగకపోవడం.. కంప్లీట్ కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. వీరమల్లు నుంచి తప్పుకుని ఘాటీ సినిమాని అయినా స్పీడుగా కంప్లీట్ చేసి రిలీజ్ చేసాడా అంటే అదీ లేదు. Krish’s Veeramallu And Ghati.
అందుకనే.. వీరమల్లు సినిమాని వదిలేసిన క్రిష్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో సినిమా ఆలస్యం అవుతుంది. అంత మాత్రానికే మొత్తం సినిమాను వదిలేయడం కరెక్ట్ కాదు కదా.. అంటున్నారు. పవర్ స్టార్ సినిమాని వదిలేసి ఘాటీ సినిమాని అయినా త్వరగా రిలీజ్ చేయాలని ట్రై చేశాడు కానీ కుదరడం లేదు. ఈ సినిమా మీద బజ్ ఉంది కానీ.. మరింత ఆలస్యం అయితే బజ్ తగ్గే ఛాన్స్ ఉంది. క్రిష్ కి కాలం కలిసి రావడం లేదు. మరి.. ఘాటీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.. చూడాలి.