షాకింగ్.. కుబేర ఇంకా రెడీ కాలేదా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్‌.. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ కుబేర. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ అనేదే లేకుండా.. పాజిటివ్ క్యారెక్టర్స్ తో సినిమాలు తీసే.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి రూటు మార్చి సరికొత్తగా కుబేర మూవీని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా ఎప్పుడో థియేటర్స్ లోకి రావాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదాపడింది. ఇప్పుడు ఈ నెల 20న కుబేర రిలీజ్ కానుంది. అయితే.. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. కుబేర ఇంకా రెడీ కాలేదని.. ఇంకా చాలా వర్క్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. కుబేర తెర వెనుక ఏం జరుగుతోంది..?

శేఖర్ కమ్ముల రూటే సపరేటు. ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ ఫిల్మ్ నగర్ లో ఉంటే.. శేఖర్ కమ్ముల మాత్రం సికింద్రాబాద్లో ఉంటారు. డైరెక్టర్స్ చాలా వరకు యాక్షన్, ఫ్యాక్షన్, మాస్ అంటే.. శేఖర్ కమ్ముల మాత్రం సాఫ్ట్ గా, కూల్ గా, క్లాస్ గా ఉండే సినిమాలు తీస్తుంటారు. అలాగే ఆయన మేకింగ్ స్టైలే వేరు. రాయడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అలాగే రాసింది అంతా తీస్తారు. ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని ఫైనల్ వెర్షెన్ కోసం కుస్తీపడతారు. ఇలా.. శేఖర్ కమ్ముల ఈ సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. అలాగే ఎలాంటి హాడావిడి లేకుండా సినిమాలు తీస్తుంటారు.

ఇక కుబేర విషయానికి వస్తే.. కథ రాయడానికి తన స్టైల్ కి తగ్గట్టే ఎక్కువ టైమ్ తీసుకున్నారు శేఖర్ కమ్ముల. మేకింగ్ కి టైమ్ తీసుకున్నారు. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కానీ.. ఇంకా ఈ సినిమాకి చేయాల్సిన వర్క్ చాలా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. జనరల్ గా శేఖర్ కమ్ముల సినిమా వస్తుందంటే.. రిలీజ్ డేట్ కి చాలా రోజులు ముందే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోరు కానీ.. ఈ సినిమా విషయంలో మాత్రం టెన్షన్ తప్పడం లేదని తెలిసింది.
ఈ నెల 20న కుబేర సినిమా రిలీజ్ కానీ.. ఇప్పటికీ ఇంకా రెండు పాటలు రెడీ కావాలి. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా.. నిజంగా నిజం అని వార్తలు వస్తున్నాయి.

సినిమా రిలీజ్ కి ముందు రెండు పాటలు చేయించుకోవాలి అంటే మామూలు విషయం కాదు. శేఖర్ కమ్ముల తీసింది ఎక్కువే ఉంటుంది.. ఎడింగ్ చేసిన తర్వాత తీసేంది ఎక్కువే ఉంటుంది. ఇంకా రెండు పాటలు రెడీ కావాలి.. ఆ పాటలు జనాల్లోకి వెళ్లడానికి టైమ్ లేదు. ఆ పాటలను డైరెక్టర్ గా థియేటర్స్ లోనే చూడాలి. రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ అంటే.. ప్రతి పాట ఓ ఆణిముత్యంలా.. అదిరిపోయింది అనేలా ఉంటాయి. అలాగే శేఖర్ కమ్ముల సినిమాల్లో పాటలు కూడా బాగుంటాయి. పస్ట్ టైమ్ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే.. కుబేర ఆల్బమ్ చాలా స్పెషల్ గా ఉండాలి. అయితే.. అంచనాలకు తగ్గట్టుగా కుబేర లేదు అనేది వాస్తవం. మరి.. కుబేర రిలీజ్ తర్వాత పాటలు పాపులర్ అవుతాయోమో చూడాలి.