
Coolie Telugu Rights: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఈ సినిమా అనౌన్స్ చేసిన వీడియోతోనే ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇక సాంగ్ ప్రొమో రిలీజ్ చేసి మరింతగా అంచనాలు పెంచేసారు. ఇంకా చెప్పాలంటే.. రోజురోజుకు ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా పోటీ ఏర్పడింది. మరి.. ఈ క్రేజీ మూవీ రైట్స్ ను ఎంతకు సొంతం చేసుకున్నారు..? ఎవరు దక్కించుకున్నారు..?
కూలీ సినిమాకు భారీ క్రేజ్ ఉండడంతో ఈ సినిమా రైట్స్ దక్కించుకోవడం కోసం.. ముందుగా యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ 44 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి అంత అమౌంట్ ఆఫర్ చేయడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది. అలాగే ఈ సినిమా నిర్మాతలు సైతం ఇంకా ఎక్కువగా ఆఫర్ వస్తుందని వెయిట్ చేశారు. నాగవంశీ తర్వాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ కూడా కూలీ తెలుగు రైట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపించారు. వీళ్లతో పాటు కూలీ సినిమాలో విలన్ గా నటించిన కింగ్ నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయాలని రైట్స్ కోసం ట్రై చేశారు.
అయితే.. ఫైనల్ గా ఏసియన్ సునీల్ నారంగ్ తెలుగు కూలీ రైట్స్ దక్కించుకున్నారని తెలిసింది. ఇంతకీ.. ఎంతకి ఈ రైట్స్ సొంతం చేసుకున్నారంటే.. 48 కోట్లకు డీల్ క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఏ పాత్ర పోషిస్తున్నాడు..? కీలక పాత్ర చేస్తున్నాడా..? విలన్ పాత్ర చేస్తున్నాడా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. అయితే.. ఇటీవల నాగార్జున ఈ మూవీలో విలన్ గా కనిపిస్తానని.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటానని చెప్పడంతో కూలీ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. Coolie Telugu Rights.
రజినీకాంత్, నాగార్జునతో పాటు.. కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ కూడా నటిస్తుండడంతో అసలు కథ ఏంటి..? ఈ కథలో వీళ్ల క్యారెక్టర్ ఏంటి అనే క్యూరియాసిటీ రోజురోజుకు అంచనాలు పెంచేస్తుంది. దీనికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. అనిరుథ్ రజినీ సినిమా అంటే.. వేరే లెవల్లో మ్యూజిక్ అందిస్తారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా వేరే లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. ఆగష్టు 14న కూలీ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. కూలీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.