
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే.. సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో భారీ క్రేజీ మూవీ కూలీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత చేసేందుకు వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే.. లోకేష్ తీసుకున్న నిర్ణయంతో సినీ జనాలు.. ఇదేం ట్విస్ట్ నాయనా అంటూ షాక్ అవుతున్నారు.. సర్ ఫ్రైజ్ గా ఫీలవుతున్నారు. ఇంతకీ.. లోకేష్ తీసుకున్న నిర్ణయం ఏంటి..?
లోకేష్ కనకరాజ్ 2017లో మానగరం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆతర్వాత కైతి అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాల తర్వాత మూడో సినిమాకే ఏకంగా కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో మాస్టర్ మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈసారి యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా కమల్ కు ఉన్న అప్పులు అన్నింటినీ తీర్చేలా చేసింది. అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కమల్ అయితే.. ఊహించని ఈ సక్సెస్ తో తెగ సంబరపడ్డారు.
కమల్ తో విక్రమ్ మూవీ తీసిన లోకేష్.. ఇప్పుడు రజినీకాంత్ తో కూలీ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తుండడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ థియేట్రికల్ తెలుగు రైట్స్ కోసం నలుగురు భారీ చిత్రాల నిర్మాతలు పోటీపడుతున్నారంటే.. క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో సినిమా తీసినా.. చాలా ఫాస్ట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే.. కూలీ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, అమీర్ ఖాన్ తో సూపర్ హీరో సినిమా, విజయ్ సినిమాలు చేస్తే లియో 2 ఇలా.. లోకేష్ కనకరాజ్ నెక్ట్స్ సినిమాల లిస్ట్ పెద్దదే ఉంది. అయితే.. ఇంత బిజీగా ఉన్న లోకేష్ హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇదేదో గాసిప్ అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా నిజం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినీ జనాలు షాక్ అవుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ గా బిజీగా ఉన్న లోకేష్ ఇప్పుడు హీరోగా ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. లోకేష్ హీరోగా నటించే సినిమాకి అరుణ్ మాథేశ్వరన్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ కీర్తి సురేష్ తో సాని కాయితం, ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ చిత్రాలు రూపొందించాడు. ఈ సినిమా కోసం లోకేష్ మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. మరో వైపు లారెన్స్ తో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు లోకేష్. ఇంత బిజీలో లోకేష్ హీరోగా సినిమా చేస్తుండడం విశేషం. మరి.. దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్.. హీరోగా ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.