
Mahesh Babu Appreciate Sumanth: అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ ఎంత క్లోజ్ అంటే.. మహేష్ బాబు.. నమ్రతల లవ్ మ్యారేజ్ అతి కొద్దిమంది సమక్షంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఆ అతికొద్ది మందిలో సుమంత్ కూడా ఉన్నాడు. దీనిని బట్టి వీరి మధ్య ఎంత అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ బాబు.. తన స్నేహితుడు సుమంత్ ను అభినందించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. సుమంత్ ను మహేష్ బాబు అభినందించడానికి కారణం ఏంటి..? ఇంతకీ మహేష్ ఏమని ట్వీట్ చేశాడు..?
సుమంత్ ప్రేమకథ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేయడం.. తొలి సినిమాతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించుకోవడం తెలిసిందే. యువకుడు, పెళ్లి సంబంధం, రామ్మా చిలకమ్మా, స్నేహమంటే ఇదేరా చిత్రాలతో మెప్పించినప్పటికీ.. బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమా మాత్రం సత్యం. ఇక గౌరీ, మహానది, గోదావరి, మధుమాసం.. ఇలా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. అయితే.. సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్ లో వెనబడ్డాడు. అయినప్పటికీ.. తనకు వస్తున్న అవకాశాలను సదిన్వియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. Mahesh Babu Appreciate Sumanth
ఇటీవల అనగనగా అంటూ ఓ వెబ్ మూవీ చేశాడు. వైవిధ్యమైన కథ, కథనంతో రూపొందిన అనగనగా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిమాండ్ రావడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సాధారణంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు కానీ.. ఈ సినిమా ముందుగా ఓటీటీలో రిలీజ్ చేసిన తర్వాత థియేటర్స్ లో విడుదల చేయడం విశేషం. థియేటర్స్ లో కూడా అనగనగా సినిమాకి మంచి ఆదరణ లభించింది.

ఇలా ఓటీటీలో, థియేటర్ లో విజయం సాధించిన అనగనగా మూవీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అనగనగా మూవీ సింపుల్ గా సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా అందంగా చూపించారని.. ఈ సినిమాని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని మహేష్ బాబు ట్వీట్ చేశారు. సుమంత్ మంచి కథ ఎంచుకున్నాడు.. గొప్పగా నటించాడు అంటూ అభనిందించాడు. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కర్ని అభినందిస్తున్నాను. ఈ మూవీ టీమ్ పై నాకు ప్రేమ ఎప్పటికీ ఉంటుందని ట్వీట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మహేష్.. ఇలా సుమంత్ అనగనగా మూవీ గురించి ట్వీట్ చేయడంతో మరోసారి వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసింది.
Also Read: https://www.mega9tv.com/cinema/dil-raju-reveals-the-secret-of-arya-3-here-is-what-we-know/