మంచు విష్ణు, పూరి మధ్య అంతలా ఏం జరిగింది..?

Manchu Vishnu Puri Jagannath Controversy: మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విష్ణు పూరి జగన్నాథ్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విష్ణు.. పూరి గురించి చేసిన కామెంట్స్ ను బట్టి ఇద్దరి మధ్య ఏదో జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఇద్దరి మధ్య ఏం జరిగింది..? విష్ణు కామెంట్స్ వెనకున్న అసలు కారణం ఏంటి..?

విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి అసెంబ్లీ రౌడీ. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పచ్చు. అయితే.. ఈ సినిమాను మంచు విష్ణు చేయాలి అనుకున్నారు. అది కూడా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేయాలి అనుకున్నారు. మంచు విష్ణునే స్వయంగా పూరి జగన్నాథ్ ని తనతో అసెంబ్లీ రౌడీ సినిమా చేయమని అడిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకటి రెండు మీటింగులు జరగడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అనుకున్నారు కానీ.. ఇంత వరకు జరగలేదు.

అయితే.. కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన విష్ణుకు అసెంబ్లీ రౌడీ సినిమా చేయాలి అనుకున్నారు కదా అనే ప్రశ్న ఎదురైంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాను దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేస్తే బాగుంటుంది అన్నారు. గతంలో పూరి జగన్నాథ్ తో చేయాలి అనుకున్నారు కదా అంటే.. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నాడు. పూరి గురించి విష్ణు అలా మాట్లాడేసరికి మీడియా జనాలు షాక్ అయ్యారు. దీంతో అసలు ఏం జరిగింది..? ఎందుకు విష్ణు పూరి గురించి అంత మాట అన్నాడు అనేది ఆసక్తిగా మారింది. Manchu Vishnu Puri Jagannath Controversy.

మేటర్ ఏంటంటే.. అసెంబ్లీ రౌడీ సినిమాని తనతో చేయమని విష్ణు అడిగితే పూరి చేయలేదట. విష్ణు ఒకటి రెండు సార్లు అడిగినా చేయలేదనే కోపం ఉందట. పూరి డైరెక్షన్ లో అసెంబ్లీ రౌడీ చేసుంటే తన కెరీర్ మరోలా ఉండేది అనేది విష్ణు గట్టి నమ్మకం. అది జరగకపోయేసరికి పూరి పై కోపం పెరిగిందట. ఆ కోపాన్ని ఈ విధంగా మీడియా ముందు తెలియచేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ చేయాలంటే డైరెక్టర్స్ ఎవరూ లేరు. ఆ సినిమాని ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ లో శ్రీకాంత్ ఓదెల అయితే కరెక్ట్ గా చేస్తాడు అన్నాడు. గత కొన్ని రోజులు నుంచి శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తానని చెబుతున్నాడు. పూరితో అనుకుంటే అసెంబ్లీ రౌడీ కుదరలేదు.. మరి.. శ్రీకాంత్ ఓదెలతో అయినా సెట్ అవుతుందో లేదో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/ntr-spotted-with-the-book-called-muruga-the-lord-of-war-at-mumbai-airport/