
Manchu Vishnu Kannappa Prequel: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు అని తెలిసినప్పటి నుంచి కన్నప్ప మూవీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు కన్నప్ప గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. దీంతో కన్నప్ప ప్రీక్వల్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. కన్నప్ప గురించి విష్ణు ఏం చెప్పాడు..? నిజంగా ప్రీక్వెల్ ఉంటుందా..?
ప్రభాస్ నటించడం అనేది కన్నప్పకు బాగా ప్లస్ అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అనేది ప్రకటించలేదు కానీ.. దాదాపు 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇది మంచు విష్ణు కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ అని చెప్పచ్చు. కన్నప్ప సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంగా ఉన్న విష్ణు తన సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమాకు తెలుగు దర్శకులు కాకుండా బాలీవుడ్ నుంచి డైరెక్టర్ని తీసుకుని సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడిగితే.. తెలుగులో చాలా మంది దర్శకులను కన్నప్ప సినమాను తీయమంటే నో చెప్పారట. Manchu Vishnu Kannappa Prequel.
అందుకనే బాలీవుడ్ నుంచి ముఖేష్ కుమార్ సింగ్ ని తీసుకున్నామని తెలియచేశాడు. ఈ సినిమాకి సీక్వెల్ చేసే అవకాశం ఉందా అని అడిగితే.. ఈ సినిమాకి సీక్వెల్ చేయలేమన్నారు. అయితే.. ప్రీక్వెల్ చేయచ్చు అన్నారు. ఆ ప్రీక్వెల్ లో తిన్నడు లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? కన్నప్పగా మారడానికి ముందు అతని జీవితం ఎలా ఉండేది అనే విషయాల పై తీయొచ్చని, ఒకవేళ స్క్రిప్ట్ సహకరిస్తే కన్నప్పకు ప్రీక్వెల్ చేసే అవకాశాలు లేకపోలేదని విష్ణు హింట్ ఇచ్చారు. ఇండస్ట్రీలోని ప్రెజెంట్ జనరేషన్లోని టాప్ డైరెక్టర్ ఫోన్ చేసి ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉందా అని అడిగారని చెప్పారు.
ఆ డైరెక్టర్ అలా అడిగేసరికి నవ్వుకున్నానని.. అయితే.. ఆతర్వాత ఆలోచిస్తే చేయచ్చు అనిపించిందని తెలియచేశాడు. విష్ణు నుంచి సక్సెస్ ఫుల్ మూవీ కాదు.. అసలు సినిమా వచ్చే చాన్నాళ్లు అయ్యింది. పదేళ్లు నుంచి కథ పై కసరత్తు చేసి.. రెండు సంవత్సరాల నుంచి సీరియస్ గా వర్క్ చేసి ఎంతో కష్టపడిన విష్ణుకు ఇప్పుడు మంచి సక్సెస్ వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నానని అది కూడా డ్రీమ్ ప్రాజెక్టే అంటూ అసలు విషయం బయటపెట్టాడు. మరి.. విష్ణు నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడో..? ఏ తరహా మూవీ చేస్తాడో..? కన్నప్ప ప్రీక్వెల్ నిజంగా ఉంటుందా.. ఇవన్నీ క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read: https://www.mega9tv.com/cinema/why-nithin-says-no-to-the-thammudu-title-whats-the-reason-behind-it/