Oops… ఆ రెండు క్రేజీ సీక్వెల్స్ లేవా..?

ఇప్పుడు అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు, మీడియాం రేంజ్ హీరోలు ఎవరైనా సరే.. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఒక కథను రెండు పార్టులుగా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. వీటికి సీక్వెల్స్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ.. సీక్వెల్స్ చేయడం లేదని క్యాన్సిల్ చేసారని తెలిసింది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? సీక్వెల్స్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటి..?

ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లోనే కాదు.. ఇండియన్ స్క్రీన్స్ పై వయెలెంట్ ఎక్కువుగా కనిపిస్తోంది. ఈ లిస్ట్ లో మోస్ట్ వయెలెంట్ మూవీ అనిపించుకున్న మూవీ మార్కో. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మలయాళ సినిమా అయిన ఈ మూవీ అక్కడ జనాలకు విపరీతంగా నచ్చేసింది. తెలుగులో రిలీజ్ చేస్తే.. ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది. హింస తక్కువుగా రియలిస్టిక్ మూవీస్ తీసే మలయిళ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా వచ్చిందా అని జనాలు షాక్ అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర బాగా లాభాలు తీసుకువచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు.

అయితే.. ఈ మార్కో సినిమాకి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు అదే స్థాయిలో నెగిటివిటి కూడా వచ్చింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ విషయంలో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సీక్వెల్స్ విషయంలో ఆలోచనలో పడ్డారు మేకర్స్. ఈ సినిమా పై వచ్చిన నెగిటివిటీ కారణంగా సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నానమిన హీరో ఉన్ని ముకుందన్ ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. ఇక మలయాళం నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు. ఈ సినిమా హైదరాబాద్ నేపధ్యంతో రూపొందింది. మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

ఈ మూవీ సీక్వెల్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు మేకర్స్ ఆ ఆలోచనను విరమించుకున్నారని తెలిసింది. దర్శకుడు గిరీష్ ఏడీ ప్రేమలు సినిమా సీక్వెల్‌ స్క్రిప్ట్‌ పనిలో ఉన్నారు అంటూ మీడియాలో ఆమధ్య వార్తలు వచ్చాయి. దీంతో ప్రేమలు సీక్వెల్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఈ సినిమా సీక్వెల్‌ లేదని, ప్రస్తుతం ఆ ఆలోచన లేదు అంటూ నిర్మాత అసలు విషయం బయటపెట్టారు. ప్రేమలు మ్యాజిక్‌ ను రీ క్రియేట్‌ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ప్రేమలు సినిమా సీక్వెల్‌ చేయాలి అనుకోవడం లేదట మేకర్స్‌.