మెగా హీరోతో మారుతి నెక్ట్స్ మూవీ నిజమేనా..?

ఈ రోజుల్లో.. అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించి ట్రెండ్ క్రియేట్ చేసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి. తన సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన మారుతి అనతి కాలంలోనే మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే ది రాజాసాబ్ అనే సినిమా చేశాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ సినిమా ఎవరితో అనేది తెలిసింది. మరి.. మారుతి నెక్ట్స్ సినిమా ఎవరితో అంటే.. మెగా హీరోతో అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ఇది నిజమేనా..?

మారుతి.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. ఎప్పటి నుంచో చిరుతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు కానీ.. వర్కవుట్ కావడం లేదు. ఆమధ్య చిరుకు కథ చెప్పాడని కూడా వార్తలు వచ్చాయి కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. గత కొంతకాలంగా మారుతి ఫోకస్ అంతా ప్రభాస్ రాజసాబ్ మూవీ పైనే ఉంది. ఇప్పటి వరకు డెబ్బై శాతం పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. ఇంకా ఇరవై ఐదు శాతం బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే.. ఇప్పటివ వరకు షూట్ చేసిన ఫుటేజే 3 గంటల వరకు ఉంటుందట. ఇంకా షూటింగ్ చేయాల్సిన సీన్స్ కూడా తీస్తే.. మూడున్నర గంటలకు పైగా రావచ్చని టాక్. అయితే.. అనవసరం అనుకున్న సీన్స్ తీసేసి.. వావ్ అనిపించేలా ఈ సినిమాను అందిస్తానని మారుతి డార్లింగ్ ఫ్యాన్స్ కి ప్రామీస్ చేశాడు.

మరి.. నెక్ట్స్ ఏంటంటే.. మారుతి ఓ ఆరు కథలు రాసి ఆరుగురు దర్శకులకు ఇచ్చాడట. ఆ ఆరుగురు దర్శకులు వాటిని స్క్రిప్ట్ రూపంలో మార్చే పనిలో ఉన్నారట. ఈ సినిమాలకు మారుతి కథా రచయితగానే ఉంటారని తెలిసింది. అయితే.. ఆ కథలు ఏంటి..? ఈ కథలను తెరకెక్కించే దర్శకులు ఎవరు..? నిర్మాతలు ఎవరు..? అనేది తెలియాల్సివుంది. ఇక రాజాసాబ్ తర్వాత మారుతి ఎవరితో సినిమా చేయాలి అనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ఇంకాస్త టైమ్ ఉందట. ఈ లోపు రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

రాజాసాబ్ మూవీకి పార్ట్ 2 తీయాలనే ప్లాన్ ఉందట. అయితే.. ముందుగా వేరే సినిమా చేసి ఆతర్వాత రాజాసాబ్ పార్ట్ 2 తీస్తారట. అయితే.. చరణ్‌ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కి పెద్ది షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఆతర్వాత ఎవరితో చరణ్ సినిమా అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి.. మారుతి.. చరణ్‌ ని మెప్పిస్తే.. ప్రాజెక్ట్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా చరణ్ కోసం వెయిట్ చేయాలి. మరి.. మారుతి చరణ్‌ కోసం వెయిట్ చేస్తాడా..? ఈ గ్యాప్ లో మరో హీరోతో మూవీని ప్లాన్ చేస్తాడా..? ఏం చేయనున్నాడు అనేది తెలియాల్సివుంది.