
మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న రెండు సినిమాల్లో ఒకటి విశ్వంభర, రెండోది పెద్ది. విశ్వంభర సినిమాను మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో రూపొందిస్తున్నారు. పెద్ది సినిమాను బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు విడుదల కాలేదు. పెద్ది సినిమా మార్చి 27న రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే.. ఇప్పుడు ఓ విషయం మెగా ఫ్యాన్ ని తెగ టెన్షన్ పడుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడడానికి కారణం ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు జూన్ 12న రావాలి కానీ.. పోస్ట్ పోన్ అవుతోంది. మరి.. వీరమల్లు వచ్చేది ఎప్పుడంటే.. జులైలో అని వార్తలు వస్తున్నాయి. జులైలో మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు వీరమల్లు జులైలో వస్తే.. విశ్వంభర మరింత గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే.. జులైలో విశ్వంభర రావడం లేదు అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా విశ్వంభర ఆలస్యం అవుతుండడం.. ఆమధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ లో క్వాలిటీ సరిగా లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా విఎఫ్ఎక్స్ వర్క్ ను మరింత కేర్ తీసుకుని చేస్తున్నారని తెలిసినప్పటికీ మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మాత్రం పోవడం లేదు.
అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎక్కువగా టెన్షన్ పడుతుంది పెద్ది సినిమా గురించే. కారణం ఏంటంటే.. ఈ సినిమాకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రెహ్మాన్ కు తెలుగులో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేవు. అంతే కాకుండా.. రెహ్మాన్ తెలుగు స్ట్రైయిట్ మూవీకి సంగీతం అందిస్తే.. ఆ సినిమా ఫ్లాపే అనే సెంటిమెంట్ ఉంది. కాకపోతే.. ఆ సెంటిమెంట్ ను ఏమాయచేశావే బ్రేక్ చేసింది. అయితే.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచేంత కలెక్షన్ రాబట్టలేదు. ఈ ఒక్క సినిమా తప్పితే రెహ్మాన్ తెలుగులో సంగీతం అందించిన సినిమాలు అన్నీ ఫ్లాపే అయ్యాయి.
ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల రెహ్మాన్ ఫామ్ లో లేడు. రీసెంట్ గా కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ మూవీకి సంగీతం అందించాడు. ఈ సినిమాలో మ్యూజిక్ ఏమాత్రం మెప్పించలేదు. ఈ మూవీలోని పాటలు, బీజీఎమ్ ఒకదానితో మరోటి పోటీపడి నీరసంగా సాగాయి. లెజండరీ డైరెక్టర్ మణిరత్నమే రెహ్మాన్ నుంచి అదిరిపోయే మ్యూజిక్ రాబట్టలేకపోతే.. ఇక బుచ్చిబాబు ఏం రాబడతాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో పెద్ది మ్యూజిక్ విషయంలో మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి.. రెహ్మాన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో.. పెద్దికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.