ఆ మెగా హీరో మళ్లీ తప్పు చేస్తున్నాడా..?

మెగా హీరో వరుణ్ తేజ్.. కెరీర్ ఆరంభం నుంచి కొత్తగా ట్రై చేస్తున్నాడు. తన కటౌట్ కి.. బ్యాక్ గ్రౌండ్ కి ఎవరైనా మాస్ సినిమాతో ఎంట్రీ ఇస్తారు కానీ.. వరుణ్ క్లాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఇలా విభిన్నమైన కథలు ఎంచుకుంటున్న ఈ మెగా హీరోకి ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ రాలేదు. అయినప్పటికీ కొత్తగా ట్రై చేయడం.. రిస్క్ చేయడం మాత్రం ఆపలేదు. తాజాగా మరోసారి తప్పు చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. వరుణ్ తేజ్ ఏం చేయబోతున్నాడు..?

వరుణ్ తేజ్ రెగ్యులర్ స్టోరీస్ తో కాకుండా.. కొత్త తరహా కథలతో సినిమాలు చేయాలి.. ఆడియన్స్ కి న్యూ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఫస్ట్ నుంచి తపిస్తున్నాడు. గత కొంతకాలంగా వరుణ్ నటించిన సినిమాలు ఆడడం లేదు. అయినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. కొత్త కథలు ఎంచుకోవడమే కాదు.. ఆ కథల్లోని పాత్రల్లో మెప్పించడానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాడు కానీ.. సక్సెస్ మాత్రం రావడం లేదు. తొలిప్రేమ, ఫిదా రేంజ్ లో కాకపోయినా.. గద్దలకొండ గణేష్ రేంజ్ లో డీసెంట్ సక్సెస్ వచ్చినా చాలు అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కానీ.. అది రావడం లేదు. గని, ఆపరేషన్ వాలెంటైన్, గాంఢవధారి అర్జున, మట్కా.. ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడంతో వరుణ్ మార్కెట్ బాగా పడిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేసి విజయం సాధించాలి.. ఫామ్ లోకి రావాలి అనుకుంటారు కానీ.. వరుణ్ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. అదే.. కొరియన్ కనకరాజ్. ఈ మూవీ డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఇదోక హర్రర్ కామెడీ మూవీ. కథ పై నమ్మకంతో మేర్లపాక గాంధీ హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించలేదు. సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా అనంతపూర్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొరియా వెళ్లేందుకు రెడీ అవుతోంది.

కొరియన్ కనకరాజు మూవీనే ప్లాప్ డైరెక్టర్ తో చేయడం అనేది రిస్క్ అనుకుంటే.. ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ కి చాన్స్ ఇవ్వడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఎవరా ఫ్లాప్ డైరెక్టర్ అంటే.. విక్రమ్ సిరికొండ. రచయితగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మిరపకాయ్, రేసుగుర్రం తదితర చిత్రాలకు వర్క్ చేశాడు. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజతో టచ్ చేసి చూడు అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ 2018లో వచ్చింది. ఆతర్వాత విక్రమ్ సిరికొండ నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ ను తన కథతో మెప్పించాడని.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. వరుసగా ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుణ్‌ తప్పు చేస్తున్నాడు అంటున్నారు సినీ జనాలు. మరి.. ఈసారైనా సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.