విశ్వంభర.. రిలీజ్ ప్లాన్ అదిరిందిగా..?

Vishwambhara Movie Release Date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ సినిమా సంక్రాంతికి రావాలి.. మరో సంక్రాంతి రిలీజ్ చేయడానికి మరో సినిమాని రెడీ చేస్తున్నారు కానీ.. విశ్వంభర వచ్చేది ఎప్పుడో మాత్రం చెప్పడం లేదు. ఈ మూవీని పక్కనపెట్టేసి.. చిరు అనిల్ రావిపూడి సినిమాలో బిజీ అయ్యారు. దీంతో విశ్వంభర ఏమైంది..? ఎందుకు రిలీజ్ చేయడం లేదు..? ఎందుకు దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడం లేదు. అసలు ఈ ఇయర్ లో విశ్వంభర వస్తుందా..? లేదా..? ఇలా మెగా ఫ్యాన్స్ మైండ్ లో అనేక ప్రశ్నలు. మరి.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే..

చిరు, అనిల్ రావిపూడి మూవీ చకా చకా షూటింగ్ జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. సంక్రాంతికి ఈ సినిమా రావడం పక్కా. అయితే.. పెద్ద హీరోల సినిమా సినిమాకి ఎంత లేదన్నా.. ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది. విశ్వంభర ఇప్పుడు రాకుండా ఇంకా ఆలస్యం అయితే.. విశ్వంభర సినిమాకి, అనిల్ రావిపూడి సినిమాకి గ్యాప్ తక్కువ ఉంటే రెండు సినిమాలకు ఇబ్బందే. అందుకే మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంతకీ విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతుందంటే.. ఒక ఐటం సాంగ్ బ్యాలెన్స్ ఉందట. ఇప్పుడు ఆ సాంగ్ ను ఎవరితో చేయాలి అనేది ఆలోచిస్తున్నారట మేకర్స్.

తమన్నా, పూజా హేగ్డే, సమంత, పాయల్ రాజఫుట్.. వీళ్లలో ఎవరితో ఐటం సాంగ్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారట. సమంతతో చిరు ఐటం సాంగ్ అంటే బాగోదు.. చేయదు. తమన్నా చాలా ఐటం సాంగ్స్ చేసింది. అందుచేత పూజా హేగ్డే, పాయల్ రాజఫుట్ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఐటం సాంగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ లో విజువల్స్ క్వాలీటీ లేదని విమర్శలు రావడం.. ట్రోలింగ్ చేయడం తెలిసిందే. అందుకనే క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని చిరు మేకర్స్ కు చెప్పడంతో మరింత కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారు.

మరి.. రిలీజ్ ఎప్పుడంటే.. సీజీ వర్క్ జులై ఫస్ట్ వీక్ కి కంప్టీట్ అవుతుందట. సీజీ వర్క్ బాగుంది అనుకుంటే.. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫైనల్ చేయాలి అనుకుంటున్నారట. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒకవేళ ఓజీ సెప్టెంబర్ 25న రాకపోతే.. ఆ డేట్ కి విశ్వంభర విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ కాకపోవడం వలనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన తర్వాత ప్రమోషన్స్ ఆపేసారు. మరి.. విశ్వంభర రిలీజ్ పై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Vishwambhara Movie Release Date..!

Read Also: https://www.mega9tv.com/cinema/nayanthara-and-deepika-padukone-charging-extra-remuneration-for-promotions/