
Megastar Chiru’s birthday treat: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వీరిద్దరి కాంబోలో భారీ, క్రేజీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫిక్స్ అయ్యిందనే న్యూస్ వచ్చినప్పటి నుంచి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కారణం ఏంటంటే.. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు. దీంతో మెగా 157 కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రచారం జరుగుతుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. చిరు బర్త్ డే కి ట్రీట్ వేరే లెవల్లో ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడని తెలిసింది. ఇంతకీ.. చిరు బర్త్ డే ట్రీట్ ఏంటి..? ఎలా ఉండబోతోంది..? Megastar Chiru’s birthday treat.
అనిల్ రావిపూడి కథ స్పీడుగా రాయడమే కాదు.. అంతే స్పీడుగా తీస్తాడు. అలాగే కథ పై చాలా కసరత్తు చేస్తాడు. అలా చేయడం వలనే షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడుగా సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. చిరంజీవితో చేస్తోన్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకముందే ప్రమోషన్ స్టార్ట్ చేసేసాడు. తన టీమ్ ని మెగాస్టార్ కు సరికొత్తగా పరిచయం చేశాడు. అలాగే ప్రమోషన్స్ కు దూరంగా ఉండే అందాల తార నయన తారను కూడా రంగంలోకి దింపి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కోసం హైదరాబాద్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
లేటెస్ట్ గా ఓ ఇంటర్ వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరు బర్త్ డే కి స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసినట్టుగా తెలియచేశారు. అయితే.. టైటిల్ అనౌన్స్ చేస్తారా..? గ్లింప్స్ రిలీజ్ చేస్తారా..? అనేది చెప్పలేదు కానీ.. వేరే లెవల్లో ఉండే ట్రీట్ అయితే రెడీ అవుతోందని మాత్రం తెలియచేశాడు. అలాగే ఈ సినిమాకి మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ.. ఆ టైటిల్ కాదని చెప్పారు. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ తో చేసే సంక్రాంతికి వస్తున్నాం మూవీ సీక్వెట్ టైటిల్ అని.. చిరు మూవీ టైటిల్ అందరికీ నచ్చేలా.. కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి.
అలాగే ఇందులో వెంకటేష్ రోల్ ఎలా ఉండబోతుంది..? చిరు, వెంకీ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి అంటే మాత్రం.. అది ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. మంచి టైమ్ చూసి రివీల్ చేస్తామన్నారు. ఇలా చెప్పడం బట్టి ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నారనే విషయాన్ని మరోసారి కన్ ఫర్మ్ చేశారు. ఇందులో డబ్బై శాతం కామెడీ ఉంటే.. ముప్పై శాతం డ్రామా ఉంటుందని.. మెగాస్టార్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఉండబోతుందని.. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు ఆ తరహా చిరంజీవిని చూస్తారని అనిల్ రావిపూడి తెలియచేశారు. అనిల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. రానున్న సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.