
Megastar in ustaad bhagat singh sets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూడు సినిమాల్లో వీరమల్లు, ఓజీ షూటింగ్స్ కంప్లీట్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. గబ్బర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనం. ఈ సంచలనం తర్వాత పవన్, హరీష్ శంకర్ కలిసి సినిమా చేస్తుండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లోఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ ఉండదేమో అని ప్రచారం జరిగింది కానీ.. అందరికీ షాక్ ఇస్తూ ఈ మూవీని కూడా కంప్లీట్ చేస్తుండడం విశేషం. అయితే.. ఉస్తాద్ సెట్ లో మెగాస్టార్ సందడి చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంతకీ.. ఉస్తాద్ అప్ డేట్ ఏంటి.?
పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా సెట్ లో మెగాస్టార్ రావడం అనేది చాన్నాళ్లకు జరిగింది. చిరంజీవి విశ్వంభర షూటింగ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సెట్ కు వెళ్లారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అన్నయ్య – తమ్ముడు కలుసుకున్న ఫోటోలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రిలీజ్ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. త్వరలోనే విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. Megastar in ustaad bhagat singh sets.
అయితే.. ఇటీవల వీరమల్లు షూటింగ్ జరిగింది కానీ ఆ సినిమా సెట్ కి మెగాస్టార్ వెళ్లలేదు. అలాగే ఓజీ షూటింగ కూడా జరిగింది. ఈ సినిమా సెట్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి వెళ్లలేదు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో అన్నయ్య చిరంజీవి దర్శనం ఇచ్చారు. దీంతో ఉస్తాద్ సెట్ లో విశ్వంభర అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా జెడ్ స్పీడుతో షూటింగ్ చేస్తున్నారు.
అయితే.. ఇంత బిజీలో కూడా మెగాస్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ కి వెళ్లడం విశేషం. చిరుతో పాటు నిర్మాత రవి శంకర్ కూడా ఉన్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా శ్రీలీల నటిస్తుంది. ఇంతకీ ఈ సినిమా అప్ డేట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేసేలా యూనిట్ వర్క్ చేస్తున్నారట. ఈ ఇయర్ లో వీరమల్లు, ఓజీ సినిమాలను రిలీజ్ చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నెక్ట్స్ ఇయర్ విడుదల చేయనున్నారు. అయితే.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.