
మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఇద్దరూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనుకుంటారు కానీ.. ఇద్దరు మంచి మిత్రులు. ఈమధ్య కాలంలో ఇద్దరూ కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోను ఇప్పుడు ప్రేక్షకులు చూడబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఏ సినిమాలో చిరు, మోహన్ బాబు నటించనున్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సినీ అభిమానులు. ఇంతకీ.. ఇది నిజమేనా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. భారీ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో చిరుకు జంటగా త్రిష నటించడం విశేషం. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈపాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. అయితే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అందుచేత చిరు మూవీలో మోహన్ బాబు నటిస్తుంది ఈ సినిమాలో కాదని చెప్పచ్చు.
చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో అనిల్ రావిపూడి సినిమాల పై ఇండస్ట్రీలోనే కాదు.. ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. ఈసారి కూడా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నాడు అనిల్ రావిపూడి. మరి.. ఈ సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నారా అంటే.. ఇందులోనూ కాదు అనే మాట వినిపిస్తోంది.
మరి.. చిరుతో కలిసి మోహన్ బాబు ఏ సినిమాలో నటించనున్నాడంటే.. శ్రీకాంత్ ఓదెలతో చిరు చేసే సినిమాలో అని టాక్ వినిపిస్తోంది. దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీని నేచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ ప్యారడైజ్. ఈ మూవీ తర్వాత చిరుతో శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంది. ఇందులో విలన్ పాత్ర కోసం శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబుని కాంటాక్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. చిరు మూవీలో మోహన్ బాబు నటించడం అనేది నిజమేనా అంటే.. శ్రీకాంత్ ఓదెల మోహన్ బాబుని కాంటాక్ట్ చేయడం అనేది నిజమే అని.. అయితే.. అది చిరు మూవీ కోసమా..? నాని ప్యార్ డైజ్ కోసమా..? అనేది తెలియాల్సివుందని టాక్ వినిపిస్తోంది. మరి.. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.