
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు రావడమే కానీ.. సినిమా మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. ఆమధ్య మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మ్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు..? త్వరలో ఈ సినిమా అప్ డేట్ ఇవ్వండి అనే డిమాండ్ అభిమానుల నుంచి రోజురోజుకు పెరుగుతుంది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఎందుకు తన వారసుడు సినిమా విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు..? ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఇది నిజమేనా..?
అఖండ సినిమా దగ్గర నుంచి బాలయ్య వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. అటు రాజకీమాల్లోనూ రాణిస్తున్నారు. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోలో కూడా అదరగొట్టేశారు. ఇంతలా ఫామ్ లోకి వచ్చిన బాలయ్య తన వారసుడు ఎంట్రీ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అభిమానులకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాను ప్రకటించిన తర్వాత కూడా స్టార్ట్ చేయకపోవడంతో అసలు బాలయ్య ప్లాన్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఎందుకు..ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ చేయలేదు అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది.
అయితే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అనేది లేదు అనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోన్న మాట. మరి.. ఎవరితో అంటే.. తాజాగా క్రిష్ పేరు వినిపిస్తోంది. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ సినిమాని ముందుగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత ఈ మూవీని తనే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు బాలయ్య. ఇప్పుడు ఈ క్రేజీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ను క్రిష్ కు అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని.. ఇందులో మోక్షజ్ఞ కీలక పాత్ర చేస్తాడని.. ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్ తో అంచనాలు అమాంతం పెంచేశాడు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి అంచనాలకు తగ్గట్టుగా అందరికీ నచ్చేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. నెక్ట్స్ ఏంటంటే.. మలినేని గోపీచంద్ తో సినిమా, మార్కో మూవీ డైరెక్టర్ హనీష్ అదేనీతో ఓ సినిమా, క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 చేయనున్నారు. వీటిలో ఏ సినిమాని ముందుగా స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సివుంది.