
నాగచైతన్య, సమంత.. వీరిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే. ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరగడం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం.. పెళ్లి చేసుకోవడం.. విడిపోవడం ఇదంతా తెలిసిందే. ఇప్పుడు చైతూ మరో పెళ్లి చేసుకుని తన సినిమాలతో బిజీ అయ్యాడు. మరో వైపు సామ్.. మరో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇలా చైతూ, సామ్.. ఇద్దరూ ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఇద్దరూ కలవబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా..? ఇంతకీ.. ఎందుకు కలుస్తారు..? కలవాల్సిన పరిస్థితే వస్తే.. చైతూ, సామ్ కలవడానికి ఓకే చెబుతారా..?
ఏమాయ చేసావే.. విభిన్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో.. చైతూ, సామ్.. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గౌతమ్ మీనన్ యూత్ కే కాదు.. పెద్దలకు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఇది సమంతకు ఫస్ట్ మూవీ అయితే.. చైతన్యకు సెకండ్ మూవీ.. అలాగే ఫస్ట్ హిట్ మూవీ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఏమాయ చేసావే సినిమా చైతన్య, సమంత కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కాబట్టే.. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే.. మళ్లీ థియేటర్స్ లో చూడాలి అనుకుంటున్నారు సినీ జనాలు.
ఈ మూవీని జులై 18న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. ఈ సినిమాలోని చైతూ, సామ్ కు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. అయితే.. ఈ మూవీ రీ రిలీజ్ కానుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాను మళ్లీ ప్రమోట్ చేస్తారని.. ఈ సందర్భంగా చైతన్య, సమంత కలిసే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో అయితే.. కొంత మంది చైతూ, సామ్ కలుస్తారని అంటుంటే.. మరి కొంతమంది కలిసే ఛాన్స్ లేదని.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమని మళ్లీ వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఇక చైతన్య కొత్త సినిమా విషయానికి వస్తే.. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో నాగచైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రలో చైతన్య కనిపించబోతున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సమంత ఓ వైపు నిర్మాతగా, మరో వైపు నటిగా బిజీ అయ్యింది. మరి.. చైతూ, సామ్.. ఏమాయ చేసావే రీ రిలీజ్ ప్రమోషన్స్ కోసమని కలవరనే మాట గట్టిగా వినిపిస్తుంది. కలిస్తే మాత్రం సంచలనమే.