
సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఆరోజున ఈ క్రేజీ మూవీకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. ఈ సినిమా తర్వాత రాజమౌళి.. మహా భారతం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి ఇంకాస్త టైమ్ కావాలి అనుకుంటే.. ఆర్ఆర్ఆర్ 2 చేయచ్చు. మరి.. మహేష్ నెక్ట్స్ ఏంటి అంటే.. ప్రభాస్ డైరెక్టర్ స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. మహేష్ కోసం స్టోరీ రెడీ చేస్తోన్న ప్రభాస్ డైరెక్టర్ ఎవరు..? అసలు ప్లాన్ ఏంటి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ రెడీ చేస్తున్న ప్రభాస్ డైరెక్టర్ ఎవరంటే.. నాగ్ అశ్విన్ అని టాక్ బలంగా వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 మూవీ చేయాలి. అయితే.. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉండడం వలన కల్కి 2 లేట్ అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే కంప్లీట్ అవ్వాలి. కల్కి 2 ఆలస్యం అవుతుండడంతో.. నాగ్ అశ్విన్.. ఆలియా భట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ అని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో నాగీ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. నాగీ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం హాలీవుడ్ రేంజ్ లో ఉండే స్టోరీ ఒకటి రెడీ చేస్తున్నాడట. మహేష్ జక్కన్నతో చేస్తున్న మూవీ తర్వాత రేంజ్ పెరగడం ఖాయం. ఆతర్వాత వచ్చే క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నాగీ టెక్నికల్ గా బాగా అడ్వాన్స్ డ్ గా ఉండేలా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. కల్కి మూవీ కోసం టెక్నాలిజీని ఎలా వాడుకున్నాడో చూశాం. ఇప్పుడు అంతకు మించి అనేలా టెక్నాలిజీని మరింతగా ఉపయోగించేలా స్టోరీ రెడీ చేస్తున్నాడని ఇడస్ట్రీలో వినిపిస్తోంది. ఇదంతా రెండు సంవత్సరాల తర్వాత చేయాలి అనుకుంటున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్లాన్. మరి.. ఈలోపు ఏం జరుగుతుందో..? నాగీ ఏం ప్లాన్ చేస్తాడో..? మహేష్ ఆలోచన ఎలా ఉందో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.